అంతర్జాతీయం

సగం సంపద సేవలకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 31: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిణి నిలేకని మరో ముగ్గురు భారతీయ మూలాలు కలిగిన బిలియనీర్లు, బిల్ అండ్ మిలిందా గేట్స్, వారెన్ బఫెట్స్ నెలకొల్పిన దాతృత్వ సంఘం ‘గివింగ్ ప్లెడ్జ్’లో చేరారు. వీరు తమ ఆస్తుల్లో సగానికి పైగా సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నట్టు ప్రకటించారు.
గత ఏడాది చేతులు కలిపిన మొత్తం 14మంది దాతల్లో నిలేకని, అనీల్, అలిసన్ భుశ్రీ, షమీర్, షబీనా వయాలిల్, బిఆర్ శెట్టి ఆయన భార్య చంద్రకుమారి రఘురామ్ శెట్టి కూడా ఉండడం గమనార్హం. నిజానికి ఈ ‘గివింగ్ ప్లెడ్జ్’ని 2010లో 40మంది అమెరికన్ దాతలు ప్రారంభించారు. ఇప్పటికి ఇందులో చేరిన సభ్యుల సంఖ్య 183కు చేరింది. వీరంతా 22దేశాలకు చెందినవారు. ఇంకా ఇందులో చేరే వివిధ దేశాలకు చెందిన సభ్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కెనడా, భారత్, యూఏఈ, అమెరికా దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. దీని సృష్టికర్తలు బిల్ అండ్ మిలిందా గేట్స్, బఫెట్స్‌లు. తాము సంపాదించిన ఆస్తిలో సగానికి పైగా దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయాలనుకునేవారు ఇందులో చేరవచ్చునని అప్పట్లోనే వీరు ప్రకటించారు. ‘గత ఎనిమిదేళ్లుగా ఎంతోమంది దాతలు గివింగ్ ప్లెడ్జ్‌లో చేరడం మాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ప్రపంచంలో అసమానతలను తొలగించడానికి సహాయపడే విధంగా తమ సంపదను వినియోగించేవారికి ఇందులో చేరడానికి ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటా,’ అని బఫెట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూఎస్‌కు చెందిన భుస్రీ ‘వర్క్‌డే’ సాఫ్ట్‌వేర్ సంస్థ వ్యవస్థాపకులు. ఫోర్బ్స్ రియల్-టైమ్ ర్యాంకింగ్స్‌లో భుస్రీ నికర ఆస్తుల విలువ 1.8 బిలియన్ డాలర్లు.నిలేకనీలు ‘ఏక్‌స్టెప్’కు సహ వ్యవస్థాపకులు. ఇది లాభాపేక్ష లేకుండా, అభ్యసనం కేంద్రంగా, సామాజిక వేదికగా పనిచేస్తుంది. ప్రస్తుతం 200 మిలియన్ల మంది ప్రాథమిక విద్యాస్థాయి పిల్లలకు విద్యావకాశాలను కల్పిస్తోంది. రోహిణీ నిలేకని, ‘అర్ఘ్యం’ వ్యవస్థాపకురాలు మరియు ఛైర్మన్ కూడా. దేశంలో సుస్థిరంగా నీరు, పారిశుద్ధ్యం కోసం ఈ సంస్థ కృషి చేస్తున్నది. వీరు తాము సమర్పించిన ప్రతిజ్ఞా పత్రంలో భగవద్గీతలోని వ్యాఖ్యలను కోట్ చేశారు. ‘కర్మలు చేయడం వరకే మనకు అధికారం ఉంది, కానీ కర్మఫలాలపై కాదు. అట్లా అని కర్మలు చేయకుండా మానరాదు. ఇదే ఆదర్శాన్ని మేం పాటిస్తాం’ అని అందులో పేర్కొన్నారు. యూఏఈలోని వీపీఎస్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన షంషీర్ వాయలీల్ తన ప్రతిజ్ఞా పత్రంలో ‘మాకు విజయమంటే, ప్రజల జీవితాల్లో సుస్థిరమైన, సానుకూల మార్పును తీసుకొని రావడమే’ అని పేర్కొన్నారు. ఈ సంస్థకు మొత్తం నాలుగు దేశాల్లో 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి.
యూఏఈకి చెందిన బీఆర్ శెట్టి ఆయన భార్య చంద్రముఖీ రఘురామ్ శెట్టి కూడా గివింగ్ ప్లెడ్జ్‌లో చేరారు. శెట్టి ఎన్‌ఎంసీ హెల్త్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ సంస్థల్లో ఒకటి. మొత్తం 13 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ప్రస్తుతం గివింగ్ ప్లెడ్జ్‌లో చేరిన 183 మంది దాతల్లో 32 నుంచి 94 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారున్నారు. వీరంతా మొత్తం 22 దేశాలకు చెందినవారు. ఇందులో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఇండియా, ఇండొనేసియా, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌కు చెందినవారున్నారు.

నందన్ నిలేకని, రోహిణి నిలేకని (ఫైల్)