అంతర్జాతీయం

భారత్-సింగపూర్ చెట్టపట్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 1: నౌకాదళ సంబంధాలతోపాటు ఆర్ధిక, రక్షణపరంగా మరింత చేరువవ్వాలన్న లక్ష్యంతో భారత్-సింగపూర్‌ల మధ్య శుక్రవారం 8 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లీ లూంగ్‌ల మధ్య జరిగిన విస్తృత చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు పరస్పరం చర్చించుకోవడంతో పాటు ఏవిధంగా ముందుకెళ్లాలన్న దానిపైనా ఓ అవగాహనకు వచ్చారు. చర్చల అనంతరం లూమ్‌తోపాటు సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మోదీ భారత్-సింగపూర్ సంబంధాల్లో ఎలాం టి అనిశ్చితి లేదని, అన్ని రంగాల్లోనూ సుహృద్భావన కొనసాగుతోందన్నారు. నౌకలు, జలాంతర్గాములు సహా రక్షణపరమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ నిర్వహిస్తున్న కీలకపాత్రను అభినంది స్తూ ఇరు దేశాలూ తమతమ జలాల పరిధిలో వ్యవస్థీకృత నౌకాదళ విన్యాసాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. భావసారూప్యం కలిగిన ఆసియాన్ దేశాలతో ఈ విషయంలో కలిసి పని చేయాలన్న దృఢ సంకల్పాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన మోదీ, లూంగ్‌లు భవిష్యత్‌లో వీటిని ఏవిధంగా బలోపేతం చేయాలన్న దానిపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే సమీకృత ఆర్థిక సహకార ఒప్పందాన్ని విజయవంతంగా సమీక్షించామని మోదీ తెలిపారు. ఈ ఒప్పందాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఇరుదేశాల అధికారులు త్వరలోనే చర్చలు జరుపుతారన్నారు. భారత్-సింగపూర్‌ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8.97 బిలియన్ డాలర్లనుంచి 18.69 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఈ సందర్భంగా తెలిపిన మోదీ 2016లో భారత్‌లో అత్యధిక స్థాయిలో పెట్టుబడి పెట్టిన దేశాల్లో సిం గపూర్‌ది రెండోస్థానమన్నారు. రానున్న రోజుల్లో తీవ్రవాదం, సైబర్ సెక్యూరిటీ సహా అనేక అంశాలపై మరింతగా సహకారాన్ని పెంపొందించుకుంటామన్నారు. ఇరు దేశాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకమైనవని మోదీ పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత, వృద్ధి, సంపద విస్తృతికి కలిసి పని చేయాలన్న దృఢ సంకల్పంతో ఇరు దేశాలూ ముందు కు సాగుతాయన్నారు.