అంతర్జాతీయం

టెక్నాలజీ, వినూత్నతే గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 1: ధనిక, పేద వైరుధ్యాలను తొలగించేందుకు టెక్నాలజీ ఆధారిత సామాజిక నిర్మాణం ఎంతైనా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈరకమైన పరిణామాల కారణంగా ఏర్పడే కొన్ని ఇబ్బందులను విధ్వంసపూరితమైనవిగా, అనాలోచితమైనవిగా పరిగణించడానికి ఎంతమాత్రం వీల్లేదని స్పష్టం చేశారు. నేల నలుచెరుగులా టెక్నాలజీ విస్తరించడం వల్ల కోటానుకోట్ల మంది తమ గళాన్ని విప్పుతున్నారని, సామాజిక అడ్డుగోడలను నిర్మూలించగలుగుతున్నారని మోదీ పేర్కొన్నారు. అయితే 21వ శతాబ్ద సవాళ్లను అర్ధవంతమైనరీతిలో ఎదుర్కోవాలంటే వినూత్నతను మానవ విలువలతో జోడించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ‘వినూత్న’త ద్వారా ఆసియాలో పరివర్తన అన్న అంశంపై నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో పాల్గొన్న మోదీ, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఎదురవుతున్న అనేక సవాళ్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆసియా ఖండానికే ఈ శతాబ్దం పెనుసవాళ్లను విసరుతోందన్నారు. సామాజిక వైరుధ్యాలను తొలగించేందుకు తీసుకున్న నిర్ణయం విధ్వంసపూరితమైందన్న భావనతో తాను ఏకీభవించటం లేదని స్పష్టం చేశారు. ప్రారంభంలో ప్రతి వినూత్న ప్రక్రియ విధ్వంసపూరితంగా కనిపిస్తుందని పేర్కొన్న ఆయన ‘సమాజంలో టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తే అంతగానూ సామాజిక అగాధాలను నిర్మూలించే అవకాశం ఉంటుంది’ అన్నారు. అయితే టెక్నాలజీ అన్నది అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా సర్వజనీన వినియోగ సాధనంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతగా టెక్నాలజీ వేళ్లూనితే సామాజిక వైరుధ్యాలను అంతగానూ చేధించగలుగుతామన్నారు. ఈ అంశాన్ని మరింతగా వివరించిన మోదీ ‘మొదట్లో కంప్యూటర్లు వచ్చినపుడు వాటిపట్ల జనంలో ఆందోళన వ్యక్తమైంది. దశాబ్దాలు గడచిన తరువాత ఆ కంప్యూటర్లే మానవ చరిత్రను మార్చేశాయి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లలో వ్యవసాయ ఉత్పాదకత, నీరు, కాలుష్యం, పట్టణీకరణ, వాతావరణ మార్పులు మొదలైనవి ఉన్నాయని పేర్కొన్న ఆయన, ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉపాధి కల్పన కూడా అత్యంత కీలకమని, ఇందుకు వీలుగా యువత నైపుణ్యాన్ని సంతరించుకోవాలని తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం అన్నది ప్రభుత్వాలు, వర్శిటీలు, లేబరేటరీల మధ్య సమన్వయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కార విస్తృతి, పరిధిని దృష్టిలో పెట్టుకుంటే అందుకు భారీగా నిధుల అవసరమూ ఉంటుందని పేర్కొన్న ఆయన, ఇందుకు విధానపరమైన మార్పులు అత్యంత కీలకం అన్నారు. వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ సమన్వితంగానే ఈ సవాళ్లను ఎదుర్కోగలుగుతామన్నారు. 2వేల సంవత్సరాల ప్రపంచ ఆర్థిక అభివృద్ధిపై ఓ అమెరికా యూనివర్శిటీ రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా ఉటంకించిన మోదీ, దాదాపు 1600 సంవత్సరాల పాటు ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 50శాతం వాటా భారత్, చైనాలదేనని తెలిపారు. ఇటీవలి 300 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంపై పశ్చిమ దేశాల ప్రాబల్యం పెరిగిందని మోదీ వివరించారు.

చిత్రం..సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో జరిగే చర్చకు హాజరవుతున్న ప్రధాని మోదీ