అంతర్జాతీయం

శాంతి కోసం ఉభయ కొరియాల చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూన్ 1: ఈ నెలలో మిలిటరీ, రెడ్‌క్రాస్ చర్చలు జరపాలని ఉభయ కొరియాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడానికి, 1950-53 యుద్ధంలో విడిపోయిన కుటుంబాలను మళ్లీ కలపడానికి వీలుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సరిహద్దు గ్రామమైన పాన్‌మున్‌జామ్‌లో ఇరు దేశా సీనియర్ అధికార్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. అంతేకాకుండా ఉత్తర కొరియా సరిహద్దు పట్టణం కేసంగ్‌లో అనుసంధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాయి. దీన్ని రెండు దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. నిజానికి ఈ కార్యాలయం 2016, ఫిబ్రవరి వరకు పనిచేసింది.