అంతర్జాతీయం

కలసి వుంటే.. కలదు సుఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జూన్ 2: మూడు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ముగించుకుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మూడు రోజుల్లో ఆయన ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ దేశాల్లో పర్యటించారు. చివరి రోజు శనివారం ఆయన సింగపూర్‌లో హిందూ, బౌద్ధ ఆలయాలను, మసీదును సందర్శించడం విశేషం. ఈ పర్యటన జయప్రదమైనట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. సింగపూర్ ప్రధాని లీ సెన్ లూంగ్‌తో జరిపిన చర్చలు జయప్రదమయ్యాయని, ఆసియా రక్షణ వ్యూహాత్మక వ్యవహారాలపై నిర్వహించిన ప్రతిష్టాకరమైన షాంగ్రి-ల-డయలాగ్ సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం. లేదంటే అందరూ నష్టపోతాం. ఆసియాలోని దేశాలు విభేదాలను విడనాడాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటే అభివృద్ధి సాధ్యం’ అని మోదీ ఇచ్చిన పిలుపుకు విశేషస్పందన లభించింది. మోదీ చివరి రోజు శుక్రవారం అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్‌ను కూడా కలుసుకున్నారు. సింగపూర్‌లో చాంగి నావల్ బేస్‌ను సందర్శించారు. అక్కడ భారత, సింగపూర్ నౌకాదళ సిబ్బందిని కలుసుకున్నారు. మలేషియా అధ్యక్షుడు మహతీర్ మహ్మద్‌ను కలుకున్నారు. 92 సంవత్సరాల వయస్సులో మహతీర్ అధ్యక్షుడిగా గెలవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం విదితమే. మోదీ, మహతీర్‌లు అభివృద్ధి, సహకారంపై చర్చించారు. మోదీ తొలి రోజు ఇండోనేషియాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు జోకోవిడోడోతో చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఉభయ దేశాలు నిర్మూలించేందుకు సహకరించుకోవాలని నిర్ణయించారు. 15 ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు సంతకాలు చేశారు.
మధుబని చిత్రపటాన్ని కొనుగోలు చేసిన మోదీ
సింగపూర్‌లో శనివారం ప్రధాని మోదీ ఇండియన్ హెరిటేజ్ సెంటర్‌లో మధుబని చిత్రపటాన్ని రూపే కార్డు ద్వారా కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు. మిథిలా పెయింటింగ్ నేపాల్, భారత్‌లో ప్రాచుర్యంలో ఉందన్నారు. మధుబని పెయింటింగ్ ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. భీమ్, రూపే, ఎస్‌బిఐలకు చెందిన మొబైల్ పేమెంట్ యాప్‌లను ఆయన ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం చినటౌన్ ప్రాంతంలో సింగపూర్‌లో హిందూ, బౌద్ధ దేవాలయాలు, మసీదును సందర్శించారు. శ్రీ మరియమ్మ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు. సింగపూర్‌లో అతి ప్రాచీన హిందూ దేవాలయంగా మరియమ్మ గుడి గణతికెక్కిం ది. మోదీకి ప్రధాన పూజారి బంగారు వస్తువును బహుకరించారు. ఈ దేవాలయాన్ని 1827లో నిర్మించారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక, మతపరమైన బంధాలను ఈ దేవాలయం గుర్తుకు తెస్తోందని మోదీ ట్వీట్ చేశారు. ఈ దేవాలయాన్ని సందర్శించిన వారికి సమస్త రోగాల నుం చి విముక్తి చెందుతారని ప్రతీతి. ఈ ప్రాంతంలో చౌలి యా మసీదును కూడా ఆయన సందర్శించారు. ఈ మసీదును 1826లో నిర్మించారు. అనంతరం ఆయన బౌద్ధదేవాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో మోదీ వెంట సింగపూర్ సాంస్కృతిక శాఖ మంత్రి గ్రాసె ఫు హా యెన్ పాల్గొన్నారు. బౌద్ధదేవాలయాన్ని 2007లో నిర్మించారు. అనంతరం భారత్ కళాకారుల కోసం సింగపూర్, భారత్, హెరిటేజ్ సెంటర్, భారత్ హైకమిషన్ ఉమ్మడిగా నిర్మించిన కళా సంగంను మోదీ ప్రారంభించారు.

చిత్రం..సింగపూర్‌లోని శ్రీ మరియమ్మన్ దేవాలయంలో పూజలు చేస్తున్న మోదీ