అంతర్జాతీయం

వీసా నిబంధనలు సరళీకృతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 2: బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ హెల్త్ సర్వీసుకు డాక్టర్ల కొరత తలెత్తింది. దీంతో దేశంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే భారత్ డాక్టర్లను అనుమతించాలని, కఠిమమైన వీసా నిబంధనలను సడలించాలని బ్రిటన్ దేశ వైద్య సంఘాలతో పాటు బ్రిటన్‌లో పనిచేస్తున్న భారత్ సంతతికి చెందిన వైద్యులు ప్రభుత్వంపై వత్తిడి పెంచారు. చివరకు బ్రిటన్ ప్రధాని థెరిసామేపై సొంత కన్జర్వేటివ్ పార్టీ నుంచి కూడా వీసా నిబంధనలను సడలించి భారత్ డాక్టర్లను ఆహ్వానించాలని డిమాండ్ పెరిగింది. బ్రిటన్‌లో వీసా నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల దేశీయ వైద్య సేవలపై ప్రతికూల ప్రభావంపడుతోందని బీఏపీఐవో అధ్యక్షుడు రమేష్ మెహతా అన్నారు. ఆయన భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లో కూడా ఇదే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. టైర్ 2 వీసా విధానంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని మెహతా కోరారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1500 వీసా దరఖాస్తులను యు హోమ్ ఆఫీసు తిరస్కరించింది. ఇమ్మిగ్రేషన్‌పై రకరకాల పద్ధతులను అమలు చేస్తున్నారని, వీటిని తొలగించి ఒకే విధానాన్ని ప్రవేశపెట్టాలని మెహతా కోరారు. బ్రిటన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన 12 వైద్య రాయల్ కాలేజీలు, నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఉద్యోగులు కూడా వీసా నిబంధనలను భారతీయ వైద్యుల విషయంలో సడలించాలని కోరారు. ఇక్కడి ప్రజలకు వైద్య సేవలు కావాలి. అవసరమైన వైద్యులు లేరు. యూరోపియన్ యూనియన్‌కు వెలుపలి నుంచి వచ్చే డాక్టర్లకు వీసాలు ఇవ్వకపోతే కష్టం అని థింక్ ట్యాంక్ బ్రిటీష్ ఫ్యూచర్ డైరెక్టర్ సుందర్ కట్వాలా తెలిపారు.