అంతర్జాతీయం

స్లొవేనియా ఎన్నికల్లో ఎస్‌డీఎస్‌కే ఆధిక్యత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుబుల్‌జనా, జూన్ 3: మధ్య ఐరోపా దేశమైన స్లొవేనియాలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. నిజానికి జూన్ 10న దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ గత మార్చిలో సెంట్రల్-లెఫ్ప్ పార్టీకి చెందిన ప్రధాన మిరో సిరార్ రాజీనామా చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూన్ 3నే ఎన్నికలు నిర్వహించారు. బిలియన్ యూరోల ఖర్చుతో ప్రభుత్వం తలపెట్టిన రైల్వే ప్రాజెక్టుపై, ప్రజాభిప్రాయం అనుకూలంగా వచ్చినా, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో సిరార్ రాజీనామా ప్రకటించారు. ప్రధాని రాజీనామా చేయకుండా ఉన్నట్లయితే ముందస్తు ఎన్నికలు జరిగి ఉండేవి కావు.
ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్టీలు పోటీ పడగా 1.7 బిలియన్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే తాజా ఎన్నికల సర్వేలు మాత్రం స్లొవేనియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌డీఎస్) అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఈపార్టీ అధినేత జానెస్ జాన్సా దేశ ప్రధానిగా 2004,2008, 2012-13లో పనిచేశారు. ఈయన వలస వ్యతిరేక ప్రచారాన్ని హంగరీ ప్రధాని బహిరంగంగా బలపరచారు. పోలింగ్ జరిగిన తీరును పరిశీలిస్తే ఎస్‌డీఎస్ 24.5శాతం ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీ అధికారంలోకి రావాలంటే మొత్తం 90 సీట్లున్న పార్లమెంట్‌లో మరోరెండు పార్టీల మద్దతు కూడగట్టక తప్పదు.