అంతర్జాతీయం

పొరుగును గౌరవిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింగ్‌డావో (చైనా), జూన్ 10: ఇరుగుపొరుగు దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవిస్తూ పరస్పర సహకారం, అభివృద్ధిపై సంబంధాలను మెరుగుపరిచేందుకు షాంఘై సహకార సంస్థలోని సభ్యత్వ దేశాలు అంకితం కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సివో) దేశాల సదస్సు జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా చైనా- పాకిస్తాన్ మధ్య నిర్మితమవుతున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును భారత్ తిరస్కరించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సెక్యూర్ విధానానికి భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. ఎస్ అంటే పౌరుల భద్రత, ఇ అంటే ఆర్థికాభివృద్ధి, సి అంటే ప్రాంతాల మధ్య అనుసంధానం, సి యు అంటే ఐకమత్యం, ఆర్ అంటే సార్వభౌమత్వం, సమగ్రత, ఇ అంటే పర్యావరణ పరిరక్షణ అన్నారు. ప్రతి దేశం సెక్యూర్‌కు కట్టుబడి ఉన్న పక్షంలోనే ఎస్‌సివోలోని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతాయన్నారు. ఇరుగు పొరుగు దేశాలతో అనుసంధానం ఉండాలని భారత్ కోరుకుంటోంది. కాని అదే సమయంలో ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. చైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా పాకిస్తాన్ వరకు నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి మాట్లాడుతూ ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే విధంగా ఉండే ఇటువంటి కారిడార్లను భారత్ ప్రోత్సహించదన్నారు. దీంతో ఈ ప్రాజెక్టును తిరస్కరిస్తున్నట్లు భారత్
ప్రకటించింది. కాని ఈ ప్రాజెక్టుకు మిగిలిన ఏడు దేశాలు మద్దతు ఇచ్చాయి. రెండు రోజుల సదస్సు తర్వాత విడుదల చేసిన డిక్లరేషన్‌లో 50 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టును భారత్ తప్ప మిగిలిన దేశాలు మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కేవలం రోడ్ల నిర్మాణం ద్వారా అనుసంధానం చేయడం ఒకటే ముఖ్యం కాదని, అంతకు ముందు ఆయా ప్రాంతాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, వాస్తవ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనుసంధానం కంటే ముందు సరిహద్దుల్లోని ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచాలన్నారు. మంచికి ఆహ్వానం పలకాలన్న విధానాన్ని భారత్ సమర్థిస్తుందన్నారు. అంతర్జాతీయంగా ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ ప్రాజెక్టును భారత్ ఆహ్వానిస్తుందన్నారు. 7200 కి.మీ పొడువున్న ఈ బహుళ విధాన రవాణా ప్రాజెక్టు వల్ల ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజెర్‌బైజాన్, రష్యా, సెంట్రల్ ఆసియా, ఐరోపా దేశాలకు లాభం కలుగుతుంది. డిజిటల్ అనుసంధానం వల్ల అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు. షాంఘై దేశాల అభివృద్ధికి చేయూత ఇస్తామన్నారు. నిర్ణీత కాలపరిమితిలోపల అజెండాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఈ సమవేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, షాంఘై ఫుడ్ ఫెస్టివల్‌ను బౌద్ధ హెరిటేజ్ ప్రదేశంలో నిర్వహిస్తామన్నారు. తమదేశానికి వచ్చే పర్యాటకుల్లో షాంఘై సభ్య దేశాల పర్యాటకుల వాటా 6 శాతం అని, ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామన్నారు. కాగా పాకిస్తాన్ అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ మాట్లాడుతూ పాకిస్తాన్-చైనా ఆర్ధిక కారిడార్‌ను ఆహ్వానించారు. పాకిస్తాన్ ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందన్నారు. ప్రస్తుతం షాంఘై సహకార సంస్థలో ఎనిమిది దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచంలోని జనాభాలో 42 శాతం జనాభా నివసిస్తున్న ఎనిమిది దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంది.

చిత్రం..షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికపైకి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్