అంతర్జాతీయం

అమెరికా మమ్నల్ని దెబ్బతీసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై (చైనా), జూన్ 10: ఇరాన్ అణు ఒప్పందాన్ని తుంగలో తొక్కి తమ దేశ ప్రయోజనాలకు అమెరికా భంగం కలిగించిందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ అన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో తమను ఆదుకునేందుకు రష్యా, చైనా, ఐరోపాదేశాలు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షాంఘై సహకార సదస్సులో ఆయన మాట్లాడుతూ, తాము అనుకున్నది అనుకున్నట్లు జరగని పక్షంలో అమెరికా ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తుందన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఏకపపక్షంగా, దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఈ విధానం వల్ల ప్రపంచ దేశాలకు హాని జరుగుతుందన్నారు. కాగా ఇరాన్ అధ్యక్షుడి ఆక్రోశంతో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ ఏకీభవించారు. ఇరాన్ ప్రయోజనాలనుకాపాడేందుకు రష్యా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ కూడా ఇరాన్‌కు బాసటగా నిలుస్తామంటూ, అమెరికా చర్యలను తప్పుబట్టారు. 2015లో ఒబామా ప్రభుత్వం ఇరాన్‌తో కుదుర్చుకున్న అణ్వస్త్ర ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది.