అంతర్జాతీయం

2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం రూ.100 బిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వింగ్‌డావో, జూన్ 10: భారత్-చైనాల మధ్య 2020 నాటికి 100 బిలియన్ యుఎస్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యంగా నిర్దేశించుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత్‌కు సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పెద్దమొత్తంలో వాణిజ్యలోటును తగ్గించేందుకు భారత్ నుంచి బాసుమతీయేతర బియ్యాన్ని, చక్కెరను దిగుమతి చేసుకోవాలని చైనా భావిస్తోందని జీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సమావేశంపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మాట్లాడుతూ, 2020 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లుగా నిర్దేశించుకోవాలిన జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారన్నారు. కాగా గత ఏడాది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 84.44 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది. నిజానికి అంతకు ముందు రెండు దేశాలు 2015 నాటికే 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనా ప్రభుత్వ బ్యాంకును ముంబయిలో ప్రారంభించేందుకు భారత్ అంగీకరించిందని గోఖలే వెల్లడించారు. ఇదిలావుండగా, చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్, భారత్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కొఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆన్ ఫైటోసానిటరీ రిక్వైర్‌మెంట్స్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భారత్ నుంచి బాసుమతేతర బియ్యాన్ని చైనా దిగుమతి చేసుకుంటుంది. ఇందుకు వీలు కల్పించేందుకోసం, ఫైటోసానిటరీ రిక్వైర్‌మెంట్స్‌కు సంబంధించిన 2006 ప్రొటొకాల్‌లో సవరణలు చేశారు. గత కొద్దినెలల క్రితం భారత్ నుంచి రెండు వాణిజ్య ప్రతినిధుల బృందాలు చైనాలో పర్యటించాయి. దీనివల్ల భారత్ నుంచి మరిన్ని వస్తువులు ఈ ఏడాది చైనా దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయని గోఖలే అన్నారు. ముఖ్యంగా భారత్‌లోని అత్యున్నత నాణ్యమైన ఫార్మా ఉత్పత్తులు చైనా మార్కెట్‌లోకి ప్రవేశించే వెసులుబాటు కలుగుతుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. మనదేశంనుంచి పెద్ద మొత్తంలో ఫార్మా ఉత్పత్తులను చైనా దిగుమతికి అనుమతించాలని మనదేశం ఎప్పటినుంచో వత్తిడి తీసుకొస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు. రెండు దేశా మధ్య ఆర్థిక సహకారాన్ని మరింతగా విస్తరించే ఉద్దేశంతోనే, ప్రధాని నరేంద్ర మోదీ చైనా ప్రభుత్వ బ్యాంకును ముంబయిలో ఏర్పాటు చేయడానికి అనుమతించారన్నారు. గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్యలోటు 36.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కాగా 2016-17లో భారత్ చైనాల వాణిజ్యలోటు 52.69 బిలియన్ యుఎస్ డాలర్లుగా నమోదుకాగా, 2017-18లో అది స్వల్పంగా తగ్గి 51 బిలియన యుఎస్ డాలర్లకు చేరుకుంది. ఈ వాణిజ్యలోటును అధిగమించేందుకే ఐటీ, ఫార్మా రంగంలో దిగుమతులకు అనుమతించాలని భారత్, చైనాపై ఒత్తిడి తీసుకొస్తోంది.

చిత్రం..చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ