అంతర్జాతీయం

పలకరింపులతోనే సరి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింగ్‌డావో (చైనా), జూన్ 10: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌తో కరచాలనం చేశారు. ఇరువురు నేతలు కరచాలనాల వరకే పరిమితమయ్యారు. ఎటువంటి చర్చలు, ప్రత్యేక భేటీలు చోటుచేసుకోలేదు. ఏసీసీవో సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ విలేఖర్లను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మోదీ, హుస్సేన్ ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఎస్‌సీవో సదస్సుకు చైనా ఆతిథ్యం ఇస్తోంది. మీడియా సమావేశానికి మోదీ, హుస్సేన్ హాజరయ్యారు. భారత్, పాకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఇవ్వడంతో ఎస్‌సీవోలో దేశాల సంఖ్య 18కి చేరింది. 2016లో జమ్ముకాశ్మీర్‌లో యురి క్యాంప్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. భారత జాతీయుడు జాదవ్‌కు పాకిస్తాన్ కోర్టులు శిక్షను విధించాయి. ఈ రెండు ఘటనలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్తాన్‌లో జరగాల్సిన 19వ సార్క్ సదస్సును భారత్ బహిష్కరించింది. దీంతో ఈ సదస్సుకు బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు హాజరుకాలేదు. జమ్ముకాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వెంట కూడా గత రెండేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

చిత్రం..పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌తో
కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ