అంతర్జాతీయం

చర్చలు జయప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింగ్ డావో: షాంఘై సదస్సు సందర్భంగా మంగోలియా, కజఖస్తాన్, కిర్జిస్తాన్ దేశాధినేతలతో పరస్పర సహకారం, ఆర్థిక రంగంలో అభివృద్ధి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య చర్చలు జరిపారు. ఈ మూడు దేశాల్లో అపారమైన వనరులు ఉన్నాయని, భారత్‌ను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని మోదీ కోరారు. షాంఘై సదస్సు నేపథ్యంలో కజఖస్తాన్ అధ్యక్షుడు నస్రుల్తాన్ నజర్‌బయేవ్‌తో మోదీ జరిపిన చర్చలు ఫలప్రదయమ్యాయని దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ వివరాలను మోదీ ట్వీట్‌లో వెల్లడించారు. భారత్ ప్రభుత్వం చేపట్టిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని మోదీ కజఖస్తాన్‌ను కోరారు. దీనికి ఆ దేశాధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుచి ఘనశ్యామ్ చెప్పారు. మోదీ కిర్జిస్తాన్ అధ్యక్షుడు సూరన్ భాయ్ జీన్‌బీవ్కోతో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని మోదీ ఆకాంక్షించారు. మంగోలియా అధ్యక్షుడు మంగోలియా కాల్డ్ మాగిన్ బట్టుల్గాతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఎస్‌సివో సందర్భంగా దాదాపు ఆరు దేశాధినేతలతో మోదీ భేటీలు నిర్వహించారు. మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్ దేశాధినేతలతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మంచి ఫలితాలు ఇచ్చాయని విదేశాంగమంత్రిత్వ శాఖ పేర్కొంది.
మధ్య ఆసియా వనరులతో అనుసంధానం ఉండేందుకు ఇరాన్‌లోని చాబహర్ రేవుద్వారా ఉజ్బెకిస్తాన్‌తో వాణిజ్య రహదారిని ఏర్పాటు చేయాలని భారత్, ఉజ్బెకిస్తాన్ నిర్ణయించాయి. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావత్ మిర్జియోయేవ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని విదేశాంగ శాఖమంత్రి విజయ్ గోఖలే చెప్పారు. షాంఘైలో ఇరు దేశాల నేతలు అనేక అంశాలపై చర్చించారు. త్వరలో న్యూఢిల్లీకి ఉజ్బెకిస్తాన్ ఉప ప్రధాని రానున్నట్లు ఆయన చెప్పారు. ఈ రహదారి ఏర్పాటు వల్ల ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లు ప్రయోజనం పొందనున్నాయి.
కాగా చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ప్రధాని మోదీ షాంగై సందేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయమై చర్చించారు. 2020 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని జింగ్ పింగ్ కోరుకుంటున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఉన్నత నాణ్యమైన ప్రమాణాలతో కూడిన ఫార్మా ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేయాలని జింగ్ పింగ్ ప్రధాని మోదీని కోరారు. కాగా మోదీ స్పందిస్తూ ముంబాయిలో బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచి ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక సహకార రంగంలో చైనాతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు.
ఉగ్రవాదానికి బలైన దేశమంటే ఆఫ్ఘనిస్తానే
ఉగ్రవాదానికి బలైన దురదృష్ట దేశం ఆఫ్ఘనిస్తాన్ అని ఈ దేశాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు భారత్ ముందుంటుందని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ సభ్యత్వ దేశాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ దేశాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి బలైన దేశాలు ఎలా ఉంటాయో ఆఫ్ఘనిస్తాన్ చక్కటి నిదర్శనమన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆఫ్ఘాన్ అభివృద్ధికి ఆష్రాఫ్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నాయన్నారు. మనందరిపైన ఆ దేశాన్ని ఆదుకోవాల్సిన ఉమ్మడి బాధ్యత ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం, భద్రత, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు. గతంలో చోటుచేసుకున్న దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రంజాన్ సందర్భంగా తాలిబాన్ల గాలింపుచర్యలు నిలిపివేస్తామని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ చేసిన ప్రకటనను మోదీ ఆహ్వానించారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు కాల్పుల విరమణను పాటిస్తామని ఆష్రాఫ్ గత వారం పేర్కొన్న విషయం విదితమే. దీనికి సానుకూలంగా స్పందించిన తాలిబాన్లు మూడు రోజుల పాటు తాము కూడా ఈద్ సందర్భంగా కాల్పులు నిలిపివేస్తామని ప్రకటించారు. 2001 తర్వాత ఈ తరహా ప్రకటనను తాలిబాన్లు చేయడం ఇది మొదటిసారి. ఈ సదస్సులో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని భారత్, చైనాలు ప్రకటించడం విశేషం.

చిత్రం..షాంఘై సదస్సులో రష్యా అధ్యక్షుడు
పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ