అంతర్జాతీయం

సహకారానికి కొత్త నిర్వచనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింగ్‌డావో (చైనా), జూన్ 10: భారత్, పాకిస్తాన్ దేశాల రాకతో షాంఘై సహకార సంస్థ బలోపేతమైందని, ప్రాంతీయ దేశాల అభివృద్ధికి శుభపరిణామమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. షాంఘై సహకార సంస్ధ సదస్సులో ఈ రెండు దేశాలకు సభ్యత్వం కల్పించడంతో, సభ్యుల సంఖ్య ఎనిమిదికి పెరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సుకు హాజరు కావడాన్ని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్-పాకిస్తాన్ దేశాలు తొలిసారిగా షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరయ్యాయి. ఈ సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ పాక్, భారత్‌లు రావడం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సహకారానికి కొత్త నిర్వచనం ఇచ్చే విధంగా షాంఘై నడుచుకుంటుందన్నారు. సమగ్ర, సహకార, భద్రత, అభివృద్ధి సాధన దిశగా అడుగులు వేస్తామన్నారు. ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పరిస్థితులు తమకు వద్దని, ఆ తరహా ఆలోచనా ధోరణిని విడనాడాలని ఆయన కోరారు. ఇతరదేశాల భద్రత ఖర్చును పెంచే విధంగా ఏ దేశం వ్యవహరించరాదన్నారు. అందరికీ భద్రత అనే లక్ష్యం ఆధారంగా కలిసి పనిచేస్తామన్నారు. స్వీయాభివృద్ధి, హ్రస్వదృష్టి, సంకుచిత తత్వంతో కూడిన విధానాలను వదిలివేయాలన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకుంటూ, బహిరంగ విపణి వ్యవస్థను నిర్మించుకోవాలన్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వాణిజ్య విధానాలు, వివిధ దేశాలతో సంబంధాల విషయంలో పారదర్శకత ముఖ్యమన్నారు. వివక్షపూరిత ఆలోచననలకు స్వస్తి చెప్పాలన్నారు. షాంఘై సహకార సంస్థలో సభ్యులు ప్రాంతీయ సహకారం ద్వారా పరస్పరం లబ్ధిపొందే విధంగా నడుచుకుంటాయన్నారు. ఆర్థిక, పెట్టుబడులు, వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో టెక్నాలజీని బదలాయించుకుంటామన్నారు. షాంఘై డిక్లరేషన్‌కు లోబడి వ్యవహరిస్తామన్నారు. ఇతర దేశాల నాగరికత, జీవన విధానాలను గౌరవించుకోవాలన్నారు. ప్రాంతీయ సహకారం పెంపుదలకు షాంఘై కట్టుబడి ఉంటుందన్నారు. ప్రపంచీకరణ వేగవంతంగా జరుగుతున్న దశలో సుపరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉగ్రవాదం, ప్రత్యేకవాదం, తీవ్రవాదం నిర్మూలనకు షాంఘై సభ్యత్వ దేశాలు కృషి చేస్తాయన్నారు. ఎస్‌సివో నిబంధనలకు లోబడి 4.7 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. 2001లో ఏర్పాటు చేసిన షాంఘై సహకార సంస్థలో ఎనిమిది దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయన్నారు.
చిత్రం..షాంఘై సహకార సదస్సులో మాట్లాడుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్