అంతర్జాతీయం

రెండు లక్షల సంవత్సరాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 10: కాంతివేగంతో మనం ప్రయాణించగలిగితే, మన గెలాక్సీ పాలపుంత డిస్క్‌ను దాటిపోవడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? సరిగ్గా రెండు లక్షల సంవత్సరాలు! అంచనా వేసినదానికంటే మన పాలపుంత డిస్క్ చాలా పెద్దదని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. సాధారణంగా పాలపుంత వంటి స్పైరల్ గెలాక్సీలకు డిస్క్‌లు ఉంటాయి. నిజానికి ఎంతో పలుచగా కనిపించే వీటిల్లోనే అత్యధికంగా నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఈ డిస్క్‌ల వ్యాసార్థం చాలా తక్కువ. వీటికి ఆవల ఉండే నక్షత్రాల సంఖ్య చాలా స్వల్పం. మన గెలాక్సీ కేంద్రం నుంచి సూర్యుడు ఉండే దూరానికి రెట్టింపు దూరంలో ఉండే నక్షత్రాల గురించి మనకు తెలియదు. అయితే గెలాక్సీ కేంద్రం నుంచి సూర్యుడికి మధ్య ఉండే దూరానికి మూడు రెట్లు, నాలుగు రెట్ల దూరాల్లో ఉండే కొన్ని నక్షత్రాల అనుపానులు మనకు తెలుసు. కాగా మన గెలాక్సీ వ్యాసార్థం 2 లక్షల కాంతి సంవత్సరాలు. ‘అపోజీ’ళ మరియు ‘ల్యామోస్ట్’ అనే రెండు ప్రాజెక్టుల కింద చేపట్టిన విశే్లషణాత్మక సర్వేలు ఈ సంగతులు తెలిశాయి. ప్రస్తుతం చేపట్టిన పరిశోధనలను స్వేచ్ఛగా, ముందు అంచనాలపై ఆధారపడకుండా, స్వేచ్ఛగా ఈ పరిశోధనలు చేపట్టామని ఐఏసీ పరిశోధకుడు ఫ్రాన్సిసోక గార్జన్ వెల్లడించారు.