అంతర్జాతీయం

పిండేయడానికి పిగ్గీ బ్యాంకులం కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 11: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవడుబడితే వాడు అమెరికాను దోచెయ్యడానికి మేమేమైనా పిగ్గీ బ్యాంకులమా? అంటూ ప్రశ్నించారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే ప్రతి దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకునేందుకు ఎప్పుడూ సిద్ధమేనని ట్రంప్ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. దిగుమతి వస్తువులపై నూరుశాతం సుంకాలు వసూలు చేస్తూ అమెరికాను భారత్ దోచుకుంటోందని ట్రంప్ వాక్బాణాలు విసిరారు.
కెనడా క్యుబెక్ సిటీలో నిర్వహించిన జి7 సమ్మిట్‌కు హాజరై డిక్లరేషన్‌పై సంతకం చేయడాన్ని వ్యతిరేకించిన ట్రంప్, శనివారం మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ‘అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై నూరుశాతం పన్ను వేస్తున్నారు. అదే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ఒక్క రూపాయి కూడా సుంకం విధించటం లేదు. మేం అలా చేయలేకపోతున్నాం’ అన్నారు. భారత్‌కు దిగుమతి అవుతున్న హార్లీడేవిడ్‌సన్ బైకులపై విధిస్తోన్న నూరుశాతం పన్నును పదేపదే ప్రస్తావిస్తూ ‘్భరత్ నుంచి అమెరికాకు వేలకు వేలు బైకులు దిగుమతి అవుతున్నాయి. మేం కూడా వాటిపై నూరుశాతం పన్నులు విధిస్తే..’ అంటూ బెదిరింపు హెచ్చరిక చేశారు. ‘ఈ విషయంలో అన్ని దేశాలతో సంప్రదిస్తున్నాం. ఈ సుంకాల విధానానికి స్వస్తి పలకాలి. లేదంటే ఆ దేశాలతో మా వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలుకుతాం. మాకు అదే పెద్ద లాభం’ అని ట్రంప్ అన్నారు.
అమెరికా ఫస్ట్ పాలసీని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వాణిజ్య పన్నులన్నింటినీ రద్దు చేయాలన్నది మా అంతిమ లక్ష్యం. చివరకు మీరు కోరుకునేదీ అదే అవుతుంది’ అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అమెరికా -్భరత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. అంతేకాదు, చైనా, యూరోపియన్ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై ట్రంప్ అధిక సుంకాలు వసూలు చేస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆయా దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.