అంతర్జాతీయం

నవశకానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచ చరిత్రకెక్కింది. దశాబ్దాల వైరానికి స్వస్తి పలికి అమెరికాతో చారిత్రక రీతిలో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. వరుసగా క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తించిన కిమ్ అమెరికాతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తిస్థాయిలో
అణ్వాయుధాలను తొలగిస్తామని ప్రపంచ దేశాల సాక్షిగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి సంయుక్తంగా సంతకం చేశారు. సింగపూర్‌లోని సాంటోసా హోటల్‌లో దాదాపు
45 నిమిషాల పాటు ఇరువురి మధ్య ముఖాముఖి చర్చలు జరిగాయి.
అనంతరం ఈ చారిత్రక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చర్చలు
ఫలప్రదంగా, నిజాయితీగా, సూటిగా జరిగాయని 71 సంవత్సరాల ట్రంప్ ప్రకటిస్తే... ఈ ఒప్పందంతో ప్రపంచంలోనే గుణాత్మక మార్పులు వస్తాయని 34 ఏళ్ల కిమ్ అన్నారు. ఇరువురి నేతలమధ్య ఎనలేని సుహృద్భావం
ద్యోతకమైంది. ఇతర దేశాలతోనూ కలిసి ఈ ఒప్పందాన్ని కొలిక్కి తెస్తామని ప్రకటించిన ట్రంప్.. కిమ్‌ను తెలివైనవాడిగా కొనియాడటంతో పాటు ఆయన్ని వైట్‌హౌస్‌కు పిలుస్తానని ప్రకటించారు. వీలును బట్టి తానూ ఉత్తర కొరియా వెళతానని ట్రంప్ చెప్పడం కొరియా అధినేతతో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు ఏర్పడిన వ్యక్తిగత అనుబంధానికి తార్కాణం. ఈ చారిత్రక ఒప్పందం పట్ల భారత్ సహా ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియాతో తలపెట్టిన సంయుక్త సైనిక విన్యాసాలను రద్దు చేసుకోవడం ద్వారా ఉత్తర కొరియా అధినేతకు ట్రంప్ మరింత ధీమాను అందించారు.