అంతర్జాతీయం

ఇక ఇరాన్‌పై ట్రంప్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్: త్వరలో ఇరాన్‌తో ‘నిజమైన ఒప్పందం’ కదుర్చుకోవడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒబామా యంత్రాంగం ప్రపంచంలోని ఇతర దేశాలతో కలిసి ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి కొద్ది వారాలక్రితం ఏకపక్షంగా వైదొలగిన ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించారు. 2015లో పీ5+1 (యుఎస్, యుకె, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ) దేశాలు ఇరాన్‌తో చర్చించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేశాయి. కాగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌తో చర్చలు జరిపిన తర్వాత మారథాన్ విలేకర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ‘అంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత సరైన సమయంలో ఇరాన్ చర్చలకు వచ్చి, నిజమైన ఒప్పందం కుదుర్చుకుంటుందని ఆశిస్తున్నా. కానీ ఇప్పుడే అంతగా ఆశించడం తొందరపాటవుతుంది’ అన్నారు. ‘ మూడు,నాలుగు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఇరాన్ పూర్తి భిన్నం. అప్పట్లో మాదిరి మెడిటరన్, సిరియాల విషయంలో ఇరాన్ పూర్తి విశ్వాసంతో వ్యవహరించడంలేదు,’ అన్నారు. ఇదిలావుండగా 2015లో యుఎస్, ఇతర ప్రపంచ దేశాలతో చర్చించి కుదుర్చుకున్న ఒప్పందంపై తిరిగి చర్చించే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇరాన్ అధినేత అయొతొల్లా అలీ ఖొమైనీ మాట్లాడుతూ, తన మాటపై నిలబడని యుఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపడం సాధ్యంకాదన్నారు. ఒప్పందం నుంచి యుఎస్ బయటకు వెళ్లిపోయిన తర్వాత, ఈయూ దేశాలు ఒప్పందాన్ని పరిరక్షించడంలో విఫలమైతే తాము తిరిగి అణుపరీక్షలు జరుపుతామని ఇరాన్ స్పష్టం చేసింది.