అంతర్జాతీయం

శిఖరాగ్ర భేటీ... చారిత్రక టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రంప్ - కిమ్ శిఖరాగ్ర భేటీలో సింగపూర్ ప్రధాన న్యాయమూర్తులు ఒకప్పుడు వినియోగించిన 80 సంవత్సరాల నాటి టేక్‌వుడ్ టేబుల్ కీలక భూమిక పోషించింది. ఈ చారిత్రక టేబుల్ పైనే నేతలు, ప్రతినిధుల మధ్య సింగపూర్‌లోని కాపెల్లా హోటల్లో చర్చలు జరిగాయి. 4.3 మీటర్ల పొడవైన ఈ టేబుల్‌పైనే ట్రంప్ -కిమ్‌లు సంయుక్త ప్రకటనపై సంతకం చేశారు. ఈ శిఖరాగ్ర సదస్సు కోసం ఈ చారిత్రక టేబుల్‌ను అమెరికా ఎంబసీ అద్దెకు తీసుకుంది. సాధారణంగా ఈ టేబుల్ సింగపూర్ జాతీయ గ్యాలరీలోని మూడో అంతస్తులో వున్న చీఫ్ జస్టిస్ చాంబర్‌లోనే ఉంటుంది. ఈ చారిత్రక టేబుల్‌కు ఘనమైన చరిత్రే ఉంది. 1963లో దీన్ని వేదికగా చేసుకునే సింగపూర్ తొలి ఆసియా ప్రధాన న్యాయమూర్తి వీ చాంగ్ జిన్ నియామకం జరిగింది. 1939నుంచి కూడా అమెరికా ప్రధాన న్యాయమూర్తి కేసుల విచారణ కోసం ఈ టేబుల్‌నే వినియోగిస్తూనే వచ్చారు. 2005లో కొత్త సుప్రీం కోర్టు భవనం ఏర్పాటు కావడంతో ఈ టేబుల్‌ను గ్యాలరీకి తరలించారు. ఒకే చెక్కతో తయారు చేయడమే దీని ప్రత్యేకత.