అంతర్జాతీయం

ట్రంప్ ‘హాలీవుడ్’ వీడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్ శిఖరాగ్ర చర్చల్లో ఓ హాలీవుడ్ తరహా వీడియో దర్శనమిచ్చింది. ఇదేదో సినిమాలకు సంబంధించింది కాదు. తమతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు తెలియజేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీడియోను ప్రదర్శించారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఈ వైరి దేశాలు చేతులు కలిపితే ఎలాంటి శాంతి అవకాశాలు అందివస్తాయో ఈ వీడియో ద్వారా ట్రంప్ తెలియజెప్పారు. ఇద్దరు వ్యక్తులు, రెండు దేశాలు, ఒకే గమ్యం - అనే పేరుతో ఈ వీడియోప్రసారమైంది. ప్రైవేటు ద్వైపాక్షిక సమావేశంలో ఈ వీడియో ప్రసారమైంది. అనంతరం ఈ వీడియో గురించి మాట్లాడిన ట్రంప్ ‘దీన్ని మేమే రూపొందించాం. మీకందరికీ ఇది నచ్చిందనే భావిస్తున్నా. కిమ్‌కు కూడా దీన్ని ప్రదర్శించాను. ఆయన కూడా దీన్ని మెచ్చుకున్నారనే ఆశిస్తున్నాను’ అని అన్నారు. ఈ వీడియోలో కిమ్‌ను ప్రజా నాయకుడిగా చూపించడం గమనార్హం. ఇందులో ట్రంప్ కూడా ప్రధాన భూమికను పోషించారు.