అంతర్జాతీయం

ట్రంప్ కోసం తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ అధినేతలను కలుసుకోవడం మాట ఎలా వున్నా కనీసం దూరం నుంచైనా చూడాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకునేందుకు ఓ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మలేషియా నుంచి సింగపూర్ వచ్చాడు. దాదాపు 38వేల రూపాయలు ఖర్చు పెట్టి ఓ రాత్రంతా ఓ హోటల్‌లో బస చేశాడు. 25 ఏళ్ల మహారాజ్ మోహన్ అనే వ్యక్తి సోమవారం షాంగ్రీలా హోటల్‌లో ఓ రూమ్ తీసుకున్నాడు. ట్రంప్‌ను చూడాలన్న ఉద్దేశంతో ఆ హోటల్ లాబీలో అటూ ఇటూ తిరుగుతూనే గడిపాడు. ఇంతకీ ఇతడికి ట్రంప్‌ను చూసే అవకాశం దక్కకపోయినా అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే ఎనిమిది టన్నుల బుల్లెట్ ప్రూఫ్ కారు ది బీస్ట్‌తో సెల్ఫీ దిగే అవకాశమే దక్కింది. అమెరికా అధ్యక్షుడు లాంటి వ్యక్తిని కలుసుకోవాలన్న ఆశతో తాను పెట్టిన ఖర్చు చెప్పుకోదగ్గది ఏమీ కాదని మోహన్ వ్యాఖ్యానించాడు. ట్రంప్ కలిసే అవకాశం దొరకదని ముందే తెలిసినా అదృష్టం కలిసి రాకపోతుందా అనే ఆశతో ఇంత ఖర్చును భరించానని తెలిపాడు. మొత్తం మీద ట్రంప్ కదలికలను మాత్రం గమనించగలిగాడు. ఇందుకోసం సోమవారం ఐదుగంటలపాటు లాబీలోనే గడిపాడు. కానీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ట్రంప్ కాపెల్లా హోటల్‌నుంచి ట్రంప్ బయటకు వెళ్లిపోతున్న సమయంలోనే ఆయన్ని చూడగలిగానని మోహన్ చెప్పాడు.