అంతర్జాతీయం

గోడ అవతలి మనుషుల కదలికలను కనిపెట్టవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోస్టన్, జూన్ 12: ఇప్పటివరకు గోడకు ఆవల ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ కృత్రిమ మేధస్సు పుణ్యమాని ఇప్పుడు గోడకు ఆవల వ్యక్తుల కదలికలను కూడా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం కృత్రిమ మేధో ఎక్స్-రే విజన్ వ్యవస్థను, ఎంఐటీ శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో గోడకు ఆవల ఉన్న వ్యక్తుల కదలికలను స్పష్టంగా వీక్షించవచ్చు. వ్యక్తుల శరీరంనుంచి వెలువడే రేడియో సంకేతాలను విశే్లషించే న్యూరల్ నెట్‌వర్క్‌ను పరిశోధకులు ఉపయోగించారు. దీని సహాయంతో గోడ ఆవతల ఉన్న వ్యక్తుల కదలికలు, కూర్చోవడం, నిలబడటం, కాళ్లు చేతులు కదపడం వంటి కృత్యాలను తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి వ్యాధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వ్యవస్థ సహాయంతో వృద్ధులు ఒకరిపై ఆధారపడకుండా, పడతామన్న భయం లేకుండా స్వతంత్రంగా నడవవచ్చు. ‘వ్యాధిపీడితులు నడిచే వేగం, ప్రాథమిక కృత్యాలు నిర్వహించే సామర్ధ్యం వంటివాటిని దగ్గరగా పరిశీలించాం,’ అని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు దీనా కటాబీ పేర్కొన్నారు. ‘ఈ విధానంలో రోగులు ఏవిధమైన సెన్సార్లు ధరించనవసరంలేదు’ అని ఆయన అన్నారు. గోడ ఆవల ఉన్న వ్యక్తుల భంగిమ, కదలికలను ఏవిధంగా గ్రహించాలో ‘ఆర్‌ఎఫ్-పోజ్, కృత్రిమ మేధస్సు ఉపకరణాలకు వివరిస్తుందని కటాబీ అన్నారు. కేవలం దీనివల్లనే ఇదంతా సాధ్యమవుతోందన్నారు. అంతేకాదు ఆర్-ఎఫ్ పోజ్‌ను కొత్త రకం వీడీయో గేమ్‌లను రూపొందించేందుకు ఉపయోగించవచ్చునని ఆయన పేర్కొన్నారు.