అంతర్జాతీయం

హెచ్-4 వీసాల రద్దుకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 15: అమెరికాలో హెచ్-4వీసాల రద్దుపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశగా వడివడిగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వీసాలను రద్దు చేసే యోచనతో ఉన్నట్లు ట్రంప్ ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. అమెరికాలో ఉద్యోగం చేయాలంటే హెచ్-1 బి వీసా ఉండాలి. కాగా దంపతుల్లో ఒకరికి హెచ్-1బి వీసా ఉంటే, మరొకరు ఉద్యోగం చేయడానికి హెచ్-4 వీసా ఉండాలి. అమెరికాలో ఉన్న వివిధ దేశాలకు చెందిన వేలాది మంది భార్యా భర్తల్లో ఒకరు హెచ్-4వీసాపై వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా హెచ్-4 వీసాపై పనిచేసే వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల హెచ్-4 వీసాపై పనిచేసే వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అమెరికాలో హెచ్-4 వీసాకు డిమాండ్ ఎక్కువ. హెచ్-1 బి వీసాపై పనిచేసుంటే, వారి జీవిత భాగస్వామికి తగిన విద్యార్హతలు ఉంటే హెచ్-4 వీసాలు ఇచ్చేందుకు అమెరికా కంపెనీలు ఉత్సాహపడుతుంటాయి. హెచ్-4 వీసాపై ఉద్యోగం చేస్తున్న వారికి ఎక్కువ నైపుణ్యం ఉంటుంది. హెచ్-4 వీసాపై ఉద్యోగం పొందడానికి వీలులేకుండా ఆదేశాలు జారీ చేసే విషయమై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. దీని వల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ మహిళలపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ సదుపాయాన్ని ఒబామా ప్రభుత్వం గతంలో కల్పించింది.
2014లో హెచ్-4 వీసాలపై ఉద్యోగం చేసే విధంగా అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెచ్-4 వీసాలపై తాజా నిబంధనలను త్వరలో జారీ చేయనున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ పేర్కొంది. కాగా అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసస్ (యుఎస్‌సిఐఎస్) మాత్రం ఈ అంశంపై ట్రంప్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదంటోంది. హెచ్-4 వీసాలపై వేటుపడేటట్లుంటే ముందుగా అప్రమత్తం చేస్తామని ఆ సంస్ధ పేర్కొంది.
యుఎస్‌సిఐఎస్ ప్రతినిధి మైఖేల్ బార్స్ మాట్లాడుతూ, అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పరిరక్షించడం తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. అమెరికాకు చెందిన ఉద్యోగులు, కార్మికుల హక్కులు, వేతనాలను పరిరక్షించాలన్నారు. ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని ఈ సంస్థ మొదటి నుంచి కోరుతోంది. ఈ విధానంలో సంస్కరణలు రావాలని మైఖేల్ చెప్పారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి వేచి చూస్తున్న భారతీయులు కాంగ్రెస్ సభ్యుడు పాల టోంకోను కలుసుకున్నారు. గ్రీన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని, హెచ్-4 వీసాలను రద్దు చేయరాదని భారతీయులు కోరారు. భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు పోరాడుతున్న రేణుకా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాలు కల్పించే హెచ్-4 వీసాలను రద్దు చేయం వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు. ఏళ్లతరబడి గ్రీన్‌కార్డుల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారన్నారు.