అంతర్జాతీయం

బ్రిటన్ ప్రధాని పదవికి నేనే అర్హురాలిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 30: ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ వారసులు ఎవరన్నదానిపై ఉత్కంఠ క్రమంగా తొలగిపోతోంది. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి ప్రధాన అభ్యర్థిగా మొదట్లో తెరపైకి వచ్చిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ తాజా పరిణామాల నేపథ్యంలో పోటీనుంచి తప్పుకున్నారు. దాంతో బ్రిటన్ హోంమంత్రి థెరిసామే ఈ పదవికి ప్రధాన అభ్యర్థిగా నిలిచారు. అనూహ్య రీతిలో పోటీ నుంచి జాన్సన్ నిష్క్రమించడంతో బ్రిటన్ మహిళా ప్రధానిగా థెరిసామే ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రధాన మంత్రి పదవికి మరో ఐదుగురు అభ్యర్థులు కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. ఎప్పుడైతే తాను పోటీ చేయడం లేదని జాన్సన్ ప్రకటించారో, మిగతా అందరికంటే కూడా థెరిసా కే అవకాశాలు మెరుగయ్యాయని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. బ్రెగ్జిట్ ఓటింగ్ కారణంగా అధికార కన్సర్వేటివ్ పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యురాలైన వ్యక్తిగా థెరిసామే తెరపైకి రావడంతో ప్రధాన మంత్రి పదవి కూడా కచ్చితంగా ఆమెనే వరించవచ్చునని తెలుస్తోంది. ‘నా పేరు థెరిసామే. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి నేనే అన్ని విధాలుగా ఉత్తమమైన అభ్యర్థిని’ అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బ్రిటన్ హోంమంత్రిగా అత్యధిక కాలంపాటు పనిచేస్తూ వస్తున్న థెరిసాకు సమర్థులైన మంత్రిగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లడం కీలకమని ఆమె తెలిపారు.

చిత్రం.. థెరిసామే