అంతర్జాతీయం

భారత్‌లో మహిళలకు భద్రత కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 26: మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ సర్వే పేర్కొంది. భారత్‌లో మహిళలపై లైంగిక హింస అత్యధికమని పేర్కొంది. ఇదే విషయంలో తర్వాతి స్థానాలను వరుసగా ఆఫ్ఘనిస్తాన్, సిరియాలు ఆక్రమించాయి. సోమాలియా, సౌదీ అరేబీయాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆన్‌లైన్‌లో, ఫోన్ ద్వారా, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కలవడం ద్వారా మొత్తం 548 మంది నిపుణులు ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వే మార్చి 26 నుంచి మే 4 వరకు కొనసాగింది. యూరప్, ఆఫ్రికా, అమెరికా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, పసిఫిక్ ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ‘‘పశ్చిమ దేశాల్లో కేవలం యుఎస్ మాత్రమే మహిళలపై లైంగిక హింసలో, అగ్రస్థానంలో ఉన్న 10 దేశాల్లో మూడో స్థానాన్ని ఉమ్మడిగా ఆక్రమించింది’’ అని ఫౌండేషన్ పేర్కొంది. మహిళలపై హింస విషయంలో 2011లో కూడా ఇదేరకమైన సర్వే నిర్వహించారు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్, డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, పాకిస్తాన్, ఇండియా, సోమాలియా దేశాలు మహిళల పరంగా అత్యంత ప్రమాదకరమైనవిగా సర్వే తేల్చింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న మొత్తం 193 దేశాల్లో, మహిళలకు అత్యంత ప్రమాదకరంతో పాటు, ఆరోగ్యరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక లేదా సంప్రదాయిక ఆచారాలు, లైంగిక హింస, మానవ అక్రమ రవాణా వంటి అంశాల్లో ముందున్న ఐదు సభ్యదేశాల పేర్లను తెలపాల్సిందిగా సర్వే నిర్వహించేవారు కోరారు. మహిళలపై లైంగిక హింస, మానవ అక్రమ రవాణా, వేధింపుల విషయంలో భారత్‌దే ఆగ్రస్థానమని సర్వేలో పాల్గొనవారిలో అధికశాతం మంది పేర్కొన్నారు. అంతేకాదు లైంగిక బానిసత్వం, గృహహింస, బలవంతపు వివాహాలు, మహిళా శిశు భ్రూణహత్యలు వంటి వాటిల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని ఫౌండేషన్ సర్వే స్పష్టం చేసింది.