అంతర్జాతీయం

బాలలకు ఆత్మాహుతి దాడులపై శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూన్ 28: అభం శుభం తెలియని చిన్నారులను చేరదీసి వారిని ఆత్మహుతి దాడులకు ఉపయోగించుకునే నీచానికి ఉగ్రవాదులు దిగజారుతున్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు విధ్వంసానికి, మారణహోమానికి పాల్పడేందుకు బాలలను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. వారికి ప్రమాదకరమైన శిక్షణ ఇస్తున్నారు. వారిని ఆత్మహుతిదాడులకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తున్నారు. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ అమానవీయ ఘటనలకు పాకిస్తాన్‌లో సాయుధ ఉగ్రవాద తండాలు పాల్పడుతున్నాయి. ఈ వివరాలను ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా బాలలు, సాయుధ సంఘర్షణాత్మక ఘటనలు అనే అంశంపై ఐక్యరాజ్యసమితి నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మూకల అరాచక దుష్ట సంస్కృతిని బహిర్గతం చేసింది. ప్రధానంగా మతపరమైన శిక్షణ ఇచ్చే మదరసాలోని బాలలను మచ్చిక చేసుకుని శిబిరాలకు ఉగ్రవాదులు తీసుకెళుతున్నారు. ఇదేదో పెద్ద ఘనకార్యమైనట్లు పసిపిల్లలకు ఆత్మహుతి దాడులపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను వీడియో కూడా తీశారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బాలలను ఉగ్రవాదుల రిక్రూట్ చేసుకున్న ఘటనలను ఐక్యరాజ్యసమితి వివరించింది. గత ఏడాది జనవరిలో టెహ్రిక్ తాలిబాన్ అనే సంస్థ వీడియోను విడుదల చేసింది. ఇందులో బాలికలను కూడా తీసుకెళ్లి శిబిరాల్లో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గ, పైశాచిక ఘటనల పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గెటిర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. బాలబాలికలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ ఇస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఆయన పాకిస్తాన్‌ను కోరారు. కాగా ఫిబ్రవరిలో సింధ్ ప్రావిన్స్‌లో సెహ్వాన్‌లో జరిగిన ఆత్మహుతిదాడిలో 75 మంది మరణించారు. ఇందులో 20 మంది పిల్లలు ఉన్నారు. మొత్తం ఎనిమిది ఆత్మహుతి దాడులు జరిగాయి. బాలికల పాఠశాలల వద్ద కూడా ఆత్మహుతి దాడులు జరిగాయరి నివేదికలో పేర్కొన్నారు. గిల్జిత్ బాల్టిస్టాన్‌లో ఆక్స్‌ఫర్డ్ పబ్లిక్ స్కూలుపై దాడికి పాల్పడ్డారు. ఈ పాఠశాలలో లేడీ టీచర్లు బురఖాధరించకపోతే దాడులు తప్పవని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి. కాగా అదే ప్రావిన్స్‌లో ఖిలా అబ్దుల్లా ప్రాంతంలో ఒక బాలిక పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. పెషావర్‌లోని ఆర్మీ స్కూలుపై తాలిబాన్లు 2014 డిసెంబర్‌లో దాడి చేసి 150 మంది పిల్లలను బలి తీసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని కలిచివేసింది.