అంతర్జాతీయం

విధి నిర్వహణలో ధైర్యంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 30: ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా విధులను నిర్వర్తించుకోవాలని జర్నలిస్టులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. భయానక దాడులు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేరీలాండ్‌లో ఒక పత్రికా కార్యాలయంలోకి చొచ్చుకుపోయినన వ్యక్తి విచక్షణారహితంగా ఐదుగురిని కాల్చిచంపిన సంఘటనపై ట్రంప్ స్పందిస్తూ, దానిని అత్యంత దారుణమై సంఘటనగా అభివర్ణించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి తన వద్ద మాటలు లేవని ట్రంప్ వ్యాఖ్యానించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. హింసను రూపుమాపే వరకూ తమ ప్రభుత్వం నిద్రపోదని అన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే..
వాషింగ్టన్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనాపొలిస్ (మేరీలాండ్)లోని కేపిటల్ గెజెట్ వార్తాపత్రికపై 38 ఏళ్ల జారొడ్ వారెన్ రామోస్ ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగినట్టు సమాచారం. 2012లో ఈ పత్రికపై రామోస్ పరువునష్టం దావా వేశాడని కోర్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు కక్ష పెంచుకున్న రామోస్ వార్తా పత్రిక కార్యాలయంలోకి చొరబడ్డాడు. తన లైసెన్స్‌డ్ తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ రాబ్ హియాసెన్, సంపాదకీయం పేజీ ఎడిటర్ గెరాల్డ్ ఫిచ్‌మన్, ఎడిటర్/రిపోర్టర్ జాన్ మెక్‌నమరా, స్పెషల్ పబ్లికేషన్స్ ఎడిటర్ రెబెక్క్పా స్మిత్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 1992లో జరిగిన ఇలాంటి సంఘటనలోనే ఏడుగురు జర్నలిస్టులు మృతి చెందారు. చాలాకాలం తర్వాత మరోసారి వార్తా పత్రిక కార్యాలయంపై దాడి జరగడం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ సంఘటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, భవిష్యత్తులు జర్నలిస్టులపై దాడులు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది.

చిత్రం..కాల్పుల సంఘటనలో మృతి చెందిన పాత్రికేయుల ఫొటోలు..