అంతర్జాతీయం

భారత వ్యతిరేక చర్యలు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 15: భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగించేందుకు తమ భూభాగంలో ఉగ్రవాదులను ఎట్టి పరిస్ధితుల్లోనూ అనుమతించేది లేదని బంగ్లాదేశ్ ఉద్ఘాటించింది.్భరత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం జరిపిన చర్చల సందర్భంగా బంగ్లాదేశ్ హోం మంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య ఇరుదేశాలకు సంబంధించిన భద్రతాపరమైన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భారత్-బంగ్లా హోం మంత్రుల స్థాయి సమావేశం జరగడం ఇది ఆరోసారి.
ఉగ్రవాద నిరోధన, పరస్పర సహకారం, సరిహద్దు నిర్వహణ సహా అనేక అంశాలపై వీరి మధ్య చర్చ జరిగిందని ఢాకాలోని భారత హై కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. సీమాంతర చొరబాట్లు, నేరాల నిరోధన, అక్రమ కార్యకలాపాల అణచివేత సహా భద్రతాపరమైన అంశాలపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టామని బంగ్లా హోం మంత్రి ఖాన్ తెలిపారు. ఉగ్రవాదం సహా అనేక జాఢ్యాలపై తాము నిస్సహన వైఖరిని అవలంబిస్తున్నామని, అందులో భాగంగానే భారత వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తెలిపారు. ఉగ్రవాద నిరోధన విషయంలో భారత్ నుంచి తమకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.