అంతర్జాతీయం

మద్దతు కోసం ఇమ్రాన్ వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 114 సీట్లు లభించినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 59 మంది మద్దతు అవసరం. దీంతో ఇండిపెండెంట్లు,చిన్న, చితకా పార్టీల నుంచి గెలిచిన వారి వేటలో మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ బిజీబిజీగా ఉన్నారు. నామినేటెడ్ సీట్ల ద్వారా కొంత బలం పెరిగినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 172 మంది మద్దతు ఉండాలి. తాజా సమాచారం ప్రకారం 270 సీట్లలో 114 సీట్లు పీటీఐకు, నవాజ్ పార్టీకి 62 సీట్లు, పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు 12 చోట్ల గెలిచారు. నవాజ్ ప్రత్యర్థి పీఎంఎల్ పర్వేజ్ పార్టీకి ఐదు సీట్లు, జమాతే ఇస్లామీకి 12 సీట్లు, కరాచీకి చెందిన ఎంక్యుఎంకు ఆరు సీట్లు వచ్చాయి. కాగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 29 మంది మహిళలను, మైనార్టీ కోటా కింద ఐదు సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను భర్తీ చేస్తే ఇమ్రాన్ బలం 150కు చేరుతుంది. ఇంకా 22 మంది మద్దతు అవసరమవుతుందని రాజకీయ విశే్లషకులంటున్నారు. కరాచీకి చెందిన ఎంక్యుఎం పార్టీ, నవాజ్ ప్రత్యర్థి పీఎంఎల్ పర్వేజ్ పార్టీ, ఇండిపెండెంట్లతో ఇమ్రాన్ పార్టీ మంతనాలు జరుపుతోంది. ప్రభుత్వం ఏర్పాటు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనపడడంలేదు. కాగా సింధ్ ప్రావిన్స్‌లో పీపీపీకి ఆధిక్యత లభించింది. ఇక్కడ 131 సీట్లలో పీపీపీకి 77 సీట్లు, పీటీఐకు22 సీట్లు, ఎంక్యుఎంకు 16 సీట్లు వచ్చా యి. పంజాబ్ అసెంబ్లీలో 297 సీట్లు ఉన్నాయి. ఇక్కడ పీఎంఎల్ నవాజ్ పార్టీకి
127 సీట్లు, పీటీఐకు 123 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఇమ్రాన్ పార్టీ ప్రకటించింది. బలూచిస్తాన్‌లో బలూచిస్తాన్ అవామీ పార్టీకి 13 సీట్లు వచ్చాయి. మొత్తం 51 సీట్లలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాలేదు. ఖైబర్ ఫక్తూన్ ఖావా అసెంబ్లీలో పీటీఐ పార్టీకి 66సీట్లు వచ్చాయి. ఈ అసెంబ్లీలో 99 సీట్లు ఉన్నాయి. పూర్తి మెజార్టీరావడంతో ఇమ్రాన్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.