అంతర్జాతీయం

రాందేవ్ బాబా ప్రధాని కావచ్చేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 28: యోగా, ఆయుర్వేద ఉత్పత్తులతో ప్రపంచ దేశాల్లో విశేష ప్రచారం పొందిన రాందేవ్ బాబా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సారూప్యతలు చాలా ఉన్నాయని, వీరిద్దరి మనస్తత్వాన్ని, ప్రవర్తనను పోల్చుతూ న్యూయార్కు టైమ్స్‌లో ఆసక్తికర వ్యాసం ప్రచురితమైంది. రాందేవ్ బాబా ఒకరోజు భారత్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ఈ పత్రిక పేర్కొంది. పతంజలి రాందేవ్ బాబా ఎప్పుడూ ఏదో ఒకరకంగా జాతీయ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకట్టుకుంటారు. డొనాల్డ్ ట్రంప్‌కు సరైన జోడి రాందేవ్ బాబా అని పేర్కొన్నారు. మోదీ శక్తివంతుడైన నేతగా ఎదగడం వెనక బిలియనీర్ యోగి అనే శీర్షికతో ఈ వ్యాసం ప్రచురితమైంది. ట్రంప్ మాదిరిగానే రాందేవ్‌కు కూడా కోట్లాది రూపాయల ఆయుర్వేద ఉత్పత్తుల సామ్రాజ్యం విస్తరించి ఉంది. ట్రంప్ తరహాలోనే టీవీ, ఇతర మీడియాల్లో రాందేవ్ చాలా పదునుగా, నిర్మోహమాటంగా, కరాఖండిగా మాట్లాడుతుంటారు. తనను అవకాశవాది అనే ముద్రవేసినా రాందేవ్ పెద్దగా ఫీలవ్వరు. ట్రంప్ కూడా అంతే. ట్రంప్ మాదిరిగానే, బాబాపేరు భారత్‌లో అబాలగోపాలానికి తెలుసు. భారత్‌లో బాబాకు, అమెరికా ట్రంప్‌కు ప్రజలతో నిత్యం మమేకమయ్యే పెద్ద వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ట్రంప్‌ను మొదట్లో అందరూ విమర్శిస్తారు. ఆయన గతం బాగాలేదని, వ్యాపారంలో లాభాల కోసం ఏమైనా చేస్తారని, స్ర్తి లోలుడని, మహిళలంటే గౌరవంలేదని, అనుకున్నది చేసి తీరుతారనే ట్రంప్‌ను విమర్శిస్తారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ మహిళలపట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. స్టార్మీ డేనియల్ అనే నటి కూడా తనతో ట్రంప్ సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలు చేశారు.