అంతర్జాతీయం

పదిహేనేళ్లకే ఇంజనీరింగ్ డిగ్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన బాల మేధావి కేవలం పదిహేనేళ్ల వయసుకే బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సులో డిగ్రీ పూర్తిచేసి తదుపరి డాక్టరేట్ (పీహెచ్‌డీ) కోసం సన్నద్ధమవుతూ అందరి ప్రశంసలందుకుంటున్నాడు. క్లిష్టతరమైన విద్యాభ్యాస ప్రయాణ లక్ష్యాన్ని చిరుప్రాయంలోనే చేరుకుంటున్న ఆ బాలుడి పేరు తనిష్క్ అబ్రహాం. కాలిఫోర్నియాలోని డేవిస్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ బాలుడు ప్రత్యేక గౌరవ పురస్కాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా అతను ఘనత సాధించినందుకు తనకు ఆనందంగానూ, గర్వంగానూ ఉందని అన్నాడు. తన ఘనతను ఎఫ్‌ఓఎక్స్ 40గా తనిష్క్ అభివర్ణించాడు. అతనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అవి అతనిలో కొనసాగాలని ఆశిస్తున్నాము అని తనిష్క్ తల్లితండ్రులు కేరళ వాస్తవ్యులైన తాజి, బిజౌ అబ్రహాంలు ఈ సందర్భంగా అన్నారు. అంతేకాదు ఈ బాలమేథావి తనిష్క్ మరో అద్భుత పరికరాన్ని సైతం రూపొందించాడు. దీని సహాయంతోకాలిన గాయాలతో చికిత్సపొందే రోగుల హృదయ స్పందన తీరును వారిని తాకకుండానే కనుగొనవచ్చు. సమీప భవిష్యత్తులోనే ఈ పరికరం పరిశోధనా విభాగాల్లోని ప్రయోగశాలలకు, వైద్య కళాశాలలకు ఓ సాధనంగా వినియోగించే అవకాశాలున్నాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొనాలన్న తాపత్రయం తనిష్క్‌లో ఉంది. ప్రత్యేకించి ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్యాన్సర్‌కు మరింత ఉన్నత సామర్థ్యంతో పనిచేసే మందులు, వైద్యవిదానాలను కనుగొనాల్సి ఉందని ఈ సందర్భంగా తనిష్క్ పేర్కొన్నాడు. మరో నాలుగైదేళ్లలో ఎండీ కోర్సును కూడా పూర్తి చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాడు.