అంతర్జాతీయం

బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 2: బంగ్లాదేశ్‌లో మరో హిందూ పూజారిపై దాడి జరిగింది. సథ్కారియా జిల్లాలోని శ్రీ రాధా గోవింద్ ఆలయ పూజారి బాబా సింధూరాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు శనివారం కత్తులతో దాడి చేశారు. ఆలయ ప్రాంగణంలోనే ముష్కరులు పదునైన ఆయుధంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. పూజారి ఇంటి తలుపుపగలగొట్టి లోపలివెళ్లి రాయ్‌పై తెగబడ్డారు. ఏడెనిమిది మంది దాడి చేసినట్టు పోలీసులు చెప్పారు. సెక్యురిటీ గార్డులనుకుని పూజారి తలుపు తీయడంతోనే పదునైన ఆయుధాలతో చాతిపైనా, వెనుక భాగంలో గాయపరిచారు. అంతకుముందురోజే హిందూ పూజారిని ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు హత్య చేశారు. తీవ్రంగా గాయపడ్డ సింధూరాయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. దాడి చేసిన దుండగులు వెంటనే పారిపోయారని బాధితుని భార్య సమిత్రాబోర్ చెప్పారు.