అంతర్జాతీయం

చరిత్ర సృష్టించిన మలానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 29: పాకిస్తాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నిల్లో ఓ హిందూ సత్తా చాటాడు. పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన తొలి హిందువుగానేగాక, మొదటి ముస్లిమేతర అభ్యర్థిగా మహేష్ కుమార్ మలానీ చరిత్ర సృష్టించారు. 16 ఏళ్ల క్రితం పాక్‌లో ముస్లిమేతరులకు ఓటు హక్కు లభించినప్పటికీ, ఇనే్నళ్లకు జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది. సింధ్ ప్రావిన్స్‌లోని థర్పార్కర్-2 నియోజకవర్గం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీ చేసిన మలానీ 1,06,630 ఓట్లు సాధించి, విజయభేరి మోగించారు. వివిధ పార్టీలు ఒకటిగా కలిసి ఏర్పడిన గ్రాండ్ డెమోక్రాటిక్ అలియన్స్ అభ్యర్థి అర్బాబ్ జకులా ఎంత ప్రయత్నించినప్పటికీ మలానీ ముందు నిలవలేకపోయాడు. అతనికి 87,251 ఓట్లు లభించాయి. రాజస్థానీ పుష్కర్ణ బ్రాహ్మణుడైన మలానీ పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. 2003 నుంచి 2008 వరకూ పాకిస్తాన్ పార్లమెంటుకు మైనారిటీ అభ్యర్థిగా నామినేటయ్యారు. 2013లో సింధ్ అసెంబ్లీకి థర్పార్కర్-3 జనరల్ సీటుకు పోటీ చేసి ఎన్నికయ్యారు. సింధ్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి ముస్లిమేతరుడిగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించారు. అసెంబ్లీ సభ్యుడిగా ఆయన విశిష్ట సేవలు అందించారు. ఆహారం తదితర అంశాలపై ఏర్పాటైన వివిధ స్టాడింగ్ కమిటీల్లో చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు జాతీయ అసెంబ్లీకి పీపీపీ తరఫున రంగంలోకి దిగి, తనకు తిరుగులేదని రుజువు చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ముస్లిమేతరులకు ఓటు హక్కు కల్పిస్తూ 2002లో అప్పటి దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు వీలుగా రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అప్పటి నుంచి సెనెట్‌లో, జాతీయ అసెంబ్లీలో ముస్లిమేతర అభ్యర్థులకు రిజర్వేషన్లు లభించాయి. మొత్తం 10 సీట్లను రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. జాతీయ అసెంబ్లీలో వివిధ పార్టీలకు వచ్చిన సీట్ల ఆధారంగా, ఆయా పార్టీలకు ఈ పది సీట్లను పంచుతారు. 272 సీట్లు ఉన్న జాతీయ అసెంబ్లీలో ముస్లిమేతరులతోపాటు మహిళలకు కూడా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ ఏడాది మార్చిలో పీపీపీ అభ్యర్థిగా థర్పార్కర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి విజయం సాధించింది. సెనెట్‌లో తొలి ముస్లిమేతర మహిళగా గుర్తింపు సంపాదించింది. తాజాగా మలానీ జాతీయ అసెంబ్లీకి ఎన్నికై, పాక్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు.