అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 5: ఇండోనేషియాలో వారం రోజుల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. లాంబాక్ ఐలాండ్‌లో ఆదివారం ఉదయం భూకంప ప్రకంపనలతో జనం పరుగులు తీశారు. అమెరికా జియలాజికల్ సర్వే ప్రకారం రిక్టర్ స్కేలుపై భూకంప పరిమాణం తీవ్రత 7గా నమోదైనట్లు పేర్కొంది. గత వారం హాలిడే ఐలాండ్‌లో సంభవించిన భూకంపం వల్ల 17 మంది మరణించారు. లాంబాక్ ఐలాండ్‌లో భూగర్భంలో పది కి.మీ లోతు నుంచి ప్రకంపనలు వెలువడినట్లు అమెరికా శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇండోనేషియా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను కూడా జా రీ చేసింది. లాంబాక్ ఐలాండ్‌లో మాతరం నగరంలో భవనాలు భూకంప తీవ్రతకు కంపించాయి. గత వారం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదు కాగా, హాలిడే ఐలాండ్‌లో వేలాది ఇండ్లు కూలిపోయాయి. భవనాలు బీటలు వారాయి.