అంతర్జాతీయం

కామాంధునికి మరో 12 మరణ శిక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్: బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం..హత్యలకు పాల్పడిన కేసులో కఠిన శిక్షను అనుభవిస్తున్న కరుడుగట్టిన కామాంధుడికి ఇలాంటి మరో మూడు కేసులతో సైతం సంబంధం ఉందని తేలడంతో పాకిస్తాన్ తీవ్రవాద నియంత్రణ ప్రత్యేక కోర్టు నిందితుడిపై నిప్పులు చెరిగింది. ఈ మానవ మృగానికి కేవలం ఒక మరణ శిక్ష సరిపోదని మరో 12 మరణ శిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. పాకిస్తాన్ కాసూర్ నగరంలో గత ఫిబ్రవరి మాసంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఇమ్రాన్ అలీ (23) నిందితుడు. ఇతను ఇప్పటికే ఏడు సార్లు మరణ శిక్ష, ఏడేళ్ల జైలు, యావజ్జీవ శిక్ష, 4.1 మిలియన్ల రూపాయల జరిమానా వంటి కఠిన శిక్షలు అనుభవిస్తున్నాడు. మరో ఎనిమిది మంది చిన్నారులపై సైతం ఈ కామాధుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. ఇలావుండగా ఇతను మరో ముగ్గురు బాలికలను సైతం అత్యాచారం చేసి హతమార్చినట్లు విచారణలో తాజాగా రుజువైంది. ఈ ఘాతుకాలపై తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ ప్రత్యేక కోర్టు తీర్పునిస్తూ మరో 12 మరణ శిక్షలు విధించింది. అంతేగాకుండా నిందితుడికి ఆరు మిలియన్ రూపాయలు జరిమానా విధించింది. ఇందులో మూడు మిలియన్ రూపాయలను బాధిత కుటుంబాలకు పరిహారం (బ్లడ్ మనీ)గా అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఇలావుండగా తను ఇంటర్నెట్‌లో చిన్నారులపై పైశాచిక చర్యలకు సంబంధించిన వీడియోలు చూడడానికి బానిసై ఇలా కరుడుగట్టిన మానసిక దౌర్బల్యంతో వ్యవహరించానని, తనపట్ల తనకే అసహ్యం వేస్తోందని నిందితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని న్యాయాధికారి ఒకరు తెలిపారు. నిందితుడి ఘాతుకాలకు తాజా కేసుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల వయసు వరుసగా ఐదు, ఏడు, ఎనిమిదేళ్లు కావడం గమనార్హం. వీరంతా నిందితుడి స్వస్థలమైన కాసూర్ నగరానికి చెందినవారే. ఓ బాలిక తండ్రి మహమ్మద్ అమీర్ అన్సారీ ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు తీర్పుపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.