అంతర్జాతీయం

అనుమానం ఐదుగురి ప్రాణాలు తీసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్‌గ్రేడ్, జూలై 2: ఉత్తర సెర్బియాలోని ఓ కేఫ్‌లో ఒక వ్యక్తి ఐదుగురిని తుపాకీతో కాల్చి చంపేశాడు. మరో ఇరవై మందిని గాయపరిచాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కు 80కి.మీ. దూరంలోని జిటిస్టే పట్టణంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుల్లో హంతకుడి భార్య కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. అనుమానం, ఈర్ష్యతోనే కాల్పులు జరిపాడని వారన్నారు. కేఫ్‌లోని ప్రవేశించి ఆటోమేటిక్ రైఫిల్‌తో ముందు భార్యపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న మరో మహిళపై గుళ్లవర్షం కురిపించారు. కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 20 మంది గాయపడ్డారు. హోమ్‌మంత్రి నిబోసా స్ట్ఫెనొవిక్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సెర్బియాలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారింది. బాల్కన్ యుద్ధం తరువాత దేశంలో అక్రమ ఆయుధాల చెలామణి ఎక్కువైపోయింది. కాగా కాల్పులు జరిపి పారిపోతున్న నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లోకి ప్రవేశించిన నిందితుడు కాసేపు భార్యతో వాగ్వివాదం చేశాడని తరువాత కలషింకోవ్ రకం తుపాకీతో కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు.