అంతర్జాతీయం

91కి చేరిన భూకంప మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మటారం, ఆగస్టు 6: ఇండోనేషియాలోని లాంబాక్ ద్వీపం ప్రాంతంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా మృతుల సంఖ్య సోమవారం నాటికి 91కి చేరుకుంది. చాలా ప్రాంతాల్లో భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వారం రోజుల కిందట 6.9 తీవ్రతతో భూకంపం సంభవించడంతో వివిధ రిసార్టుల్లో ఉన్న పర్యాటకులతోపాటు స్థానికులు దాదాపు 17 మంది మరణించారు. మళ్లీ ఆదివారం మరోసారి మరింత తీవ్రస్థాయిలో భూకంపం రావడంతో స్థానికంగా బాగా పేరు ప్రఖ్యాతులున్న పలు రిసార్టుల నుండి వందలాది మంది పర్యాటకులను ఖాళీ చేయించారు. తాజా భూకంపం ప్రభావం వల్ల పలు ఇళ్లు, ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు ధ్వంసమైన నేపథ్యంలో అందులో ఇరుక్కున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం నాటికి 91 మంది మృతి చెందగా, మరో 209 మంది తీవ్రంగా గాయపడినట్టు వార్తలు అందినట్టు నేషనల్ డిజాస్టర్ ఏజెన్సీ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నురోహో తెలిపారు. భారీ ఎత్తున భూకంపం రావడంతో చాలాచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడు వంతెనలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో బాధితులను రక్షించేందుకు వీలుగా అక్కడి చేరేందుకు కూడా సహాయక బృందాలకు అతి కష్టంగా మారింది. భూకంపం తీవ్రత విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. లాంబాక్, పరిసర ప్రాంతాల నుండి దాదాపు 20వేల మంది ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన తిండి, మందులు అందజేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లోని సౌత్ వెస్ట్‌లో గల నజ్‌ముల్ అఖ్యార్ ప్రాంతంలో భూకంపం తీవ్రతకు దాదాపు 80 శాతం పూర్తి నష్టం జరిగింది.

చిత్రం..లాంబాక్‌లో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూకంప క్షతగాత్రులు