అంతర్జాతీయం

కన్సాస్ బార్ కాల్పుల ఘటనలో నేడు నిందితుడికి శిక్ష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్సాస్,ఆగస్టు 7: అమెరికా సబర్బన్ కన్సాస్ సిటీ బార్‌లో ఇద్దరు భారతీయులపై పాశవికంగా కాల్పులు జరిపి, మరో వ్యక్తిని గాయపడేలా చేసిన నిందితుడికి నేడు శిక్షపడే అవకాశం వుంది. ఈ మూడు కేసులకు సంబంధించి ఒలాతేకు చెందిన నిందితుడు ఆడం పురింటన్ తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి ఏక కాలంలో మూడు జీవిత ఖైదు శిక్షలు విధించే అవకాశాలున్నాయి. 2017 ఫిబ్రవరి 7న తాను మొప్పై రెండేళ్ల భారతీయుడు శ్రీనివాస్ కూచిబొట్లను కాల్చి చంపానని, అతని స్నేహితుడు అలోక్ మదసానిపై కాల్పులు జరిపి గాయపరిచానని నిందితుడు అంగీకరించాడు. అలాగే కాల్పులు జరిపేముందు వారిని మా దేశం విడిచి వెళ్లిపోండని అన్నానని సైతం దుండగుడు అంగీకరించాడు. ఇప్పటికే నిందితుడు పురింటన్ (53) కన్సాస్‌లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు.