అంతర్జాతీయం

నలుగురు పిల్లల్ని చంపేసిన కన్నతల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెంఫిస్, జూలై 2: అమెరికాలో నలుగురు పిల్లలను కన్నతల్తే హతమార్చింది. పదునైన ఆయుధంలో చిన్నారుల గొంతుకోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. టనె్సస్సీలో ఈ దారణం చోటుచేసుకుంది. గేటెడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో హత్యలు జరిగినట్టు పోలీసు అధికారి ఇర్లే ఫరెల్స్ చెప్పారు. కన్నతల్లే ఇలాంటి ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తల్లిపైనా ఎలాంటి కేసు నమోదు చేయలేదని వారన్నారు. పిల్లల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న తల్లిని అదపులోకి తీసుకున్నారు. తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయం మాత్రం దర్యాప్తు తరువాతే తెలుస్తుందని కౌంటీ షరీఫ్ బిల్ ఓల్డోమెన్ స్పష్టం చేశారు. హత్యలు అత్యంత దిగ్భ్రాంతికరమైనవన్న ఆయన తల్లిపై ప్రస్తుతానికి ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు. అసలు హత్యలు ఎవరు చేశారన్నదే మిస్టరీ అని కౌంటీ కమిషనర్ మార్క్ బిల్లింగ్‌స్లే అన్నారు. బాధిత కుటుంబం వివరాలు తెలియాల్సి ఉందన్న పోలీసులు, చనిపోయిన పిల్లల వయసు ఆరేళ్ల లోపే ఉంటుందని చెప్పారు.