అంతర్జాతీయం

బతికేవున్న బగ్దాదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో/వాషింగ్టన్, ఆగస్టు 23: అందరూ చనిపోయాడని భావిస్తున్న ఐఎస్‌ఐఎస్ (ఐసిస్) చీఫ్ అబు బకర్ అల్-బగ్దాదీ తను అనుచరులకు సందేశాన్నిచ్చే ఆడియో టేప్ ఒకటి బుధవారం విడుదలైంది. 55 నిమిషాల నిడివిగల ఈ టేప్‌ను ఐసిస్ అధికారిక మీడియా అల్-్ఫర్ఖాన్ విడుదల చేసింది. గత ఏడాది మేలో సిరియా నగరం రక్కాలో రష్యా సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో అల్-బగ్దాదీ మరణించాడని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ ఆడియో టేప్‌తో బాగ్దాదీ బతికే ఉన్నాడన్న దానికి బలం చేకూరుతోంది. బగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వాద్ అల్-బద్రీ. 2014లో ఇరాక్ నగరంలోని మసూల్‌లో ఖలీఫా రాజ్యాన్ని స్థాపిస్తామని ప్రతిజ్ఞ చేసి, ఉగ్రమూకలను ఏకం చేసి దాడులకు తెగబడడంతో ఒక్కసారిగా ప్రపంచం వెలుగులోకి వచ్చాడు. బగ్దాదీ చివరి సందేశం 2017 సెప్టెంబర్‌లో విడుదలయింది. ఆ తర్వాత దాదాపు ఏడాది తర్వాత బుధవారం మరో టేప్ విడుదల కావడం గమనార్హం. ఆ టేప్‌లో ‘అల్లా ఆదేశానుసా రం మనం ఒక్కటి కావాలి. శతృమూకలను ఉమ్మడిగా ఎదుర్కోవాలి’ అని తను అనుచరులకు సందేశాన్నిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ టేప్‌లో ఉన్నది బాగ్దాది స్వరమేనా కాదా అనే దానిపై భిన్న వాదనలు వెలువడుతున్నాయి.