అంతర్జాతీయం

బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు భారత్‌ను విభజిస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లండన్, ఆగస్టు 24: భారత్‌ను బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు విభజిస్తున్నాయని, దేశ సమైక్యతకు, సమగ్రతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ సిద్ధాంతమని చెప్పారు. బీజేపీ మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల్లో ద్వేషభావాన్ని పెంపొందిస్తోందన్నారు.
రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, విద్యార్థులు నిరాశా నిస్పృహలతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్నారు. దేశ ఐక్యతకు కాంగ్రెస్ నిరంతరం పాటుపడుతోందన్నారు. ఈరోజు దేశంలో బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి హాని చేసే విధంగా ఉన్నాయన్నారు. ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం తమ కర్తవ్యమన్నారు. చైనా 50వేల మందికి 24 గంటల్లో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. భారత్ మాత్రం 450 మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఊదరగొట్టే సుదీర్ఘ ఉపన్యాసాలు వింటున్నాం కాని అభివృద్ధి జరగడం లేదన్నారు. తాను సిక్కుల మొదటి గురువు గురునానక్ ప్రవచనాలకు ప్రభావితమయ్యానని చెప్పారు. మతసామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం ఉందన్నారు. పంజాబ్ ప్రజలు తమకు అండగా నిలిచారని ఆయన చెప్పారు.
తమకు పంజాబ్‌లో ఓటు వేసి గెలిపించారన్నారు. నిజమైన స్నేహితులు మీరేనని ఆయన ప్రశంసించారు. ఐరోపా బలం అంతా భిన్నత్వంలో ఏకత్వంలో ఉందని ఇక్కడ జర్మన్ ఎంపీ చెప్పారని, భారత్ మొదటి నుంచి ఇదే తత్వాన్ని ప్రపంచానికి బోధిస్తోందన్నారు. భారత్ అభివృద్ధి తమ తొలి ప్రాధాన్యత అన్నారు. దేశంలో నిరుద్యోగం ప్రబలిందన్నారు. ఆశించినంతగా మంచి భవిష్యత్తు కనపడడంలేదనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని రాహల్ గాంధీ చెప్పారు.
భారత సమగ్రత, అభివృద్ధిలో అని వర్గాల ప్రజలను భాగస్వాములును చేయాలని మొదటి నుంచి తమ పార్టీ కోరుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌కు చెందిన సిక్కులు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీం అమరీందర్ సింగ్ హాజరయ్యారు.
డొక్లాంపై మోదీ చేసిందేమీ లేదు: రాహుల్
చైనా, భారత్ మధ్య వివాదంగా మారిన డొక్లాం అంశంపై భారత్ అనుకుంటే చైనాను నిలువరించి ఉండేదని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవేమీ పట్టనట్లు వ్యవహరించారన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయన సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ డొక్లాం పరిణామాలను ఒక వేడుకగా ప్రధాని మోదీ పరిగణించినట్లు కనపడుతోందన్నారు. డొక్లాం లాంటి అనేక ఉదంతాలు జరిగాయన్నారు. వాస్తవానికి డొక్లాంలో ఈ రోజుకు కూడా చైనా సైన్యం తిష్ట వేసి ఉందన్నరు. గత నెలలో కేంద్రమంత్రి వికెసింగ్ రాజ్యసభలో ఈ ప్రశ్నపై బదులిస్తూ డొక్లాంకు సంబంధించి కొత్త పరిణామాలేమీ లేవన్నారని బదులిచ్చిన విషయం విదితమే. స్టేటస్ కో పరిస్థితి నెలకొని ఉందని మంత్రి చెప్పరు. భూటాన్‌కు సమీపంలో ఉన్న డొక్లాం వద్ద భారత్-చైనా సైన్యం మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది. అనంతరం ఇరు దేశాల సైన్యాధిపతుల మధ్య చర్చలు జరిగిన తర్వాత డొక్లాం నుంచి ఇరుదేశాల సైన్యాలు వెనక్కు వచ్చాయి. తాజాగా డొక్లాం వద్ద చైనా సైన్యం కదిలికలు ఉన్నట్లు ఎటువంటి సమాచారం లేదు.
చిత్రం..జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ