అంతర్జాతీయం

భారత్-బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, జూలై 3: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న 20 మందిని దారుణంగా నరికి చంపిన సంఘటన తర్వాత మేఘాలయలోని 443 కిలోమీటర్ల భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు బిఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం చెప్పారు. ‘్ఢకాలో సాయుధ దాడి తర్వాత భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి బిఎస్‌ఎఫ్ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచాం. భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది’ అని బిఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (మేఘాలయ సరిహద్దు ప్రాంతం) పికె దూబే చెప్పారు. ఢాకా హత్యల వార్త తెలియగానే సమన్వయం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి తాను మేఘాలయ పోలీసులతో మాట్లాడానని ఆయన చెప్పారు. మేఘాలయ-బంగ్లాదేశ్‌ల మధ్య ఉన్న 443 కిలోమీటర్ల సరిహద్దులో 90 కిలోమీటర్లమేర కంచె నిర్మాణం జరగలేదు. ఇదే కాకుండా రాష్ట్రంలో నదులు, వాగులు, వంకలు ఎక్కువగా ఉండాన్ని బట్టి చూస్తే వంద దాకా చొరబాట్లకు అవకాశముండే ప్రాంతాలున్నాయి. అందువల్ల సరిహద్దుల్లో ఎలాంటి అక్రమ చొరబాట్లు జరక్కుండా చూడడం కోసం అన్ని రాష్ట్రాల, కేంద్ర ఇంటెలిజన్స్ విభాగాల సహకారాన్ని బిఎస్‌ఎఫ్ కోరిందని దూబే చెప్పారు. సరిహద్దులకు ఆనుకుని ప్రాంతాల్లో పని చేస్తున్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటుగా బిఎస్‌ఎఫ్‌తో సమన్వయం చేసుకుని గట్టి నిఘా పెట్టి ఉండాలని కోరడం జరిగిందని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

చిత్రం.. భారత్-బంగ్లా సరిహద్దులో పహరా కాస్తున్న బిఎస్‌ఎఫ్ జవాన్లు