అంతర్జాతీయం

భారత రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోఫియా, సెప్టెంబర్ 5: పౌర అణు విధాన రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, బల్గేరియా దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. భారత రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్, బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాడేవ్‌లు రెండు దేశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భారత రక్షణ రంగం అభివృద్ధిలో బల్గేరియా కీలక భాగస్వామి కావాలని రాష్టప్రతి కోరారు. రాష్టప్రతి కోవింద్ ఐరోపా దేశాల్లో ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బల్గేరియా రాజధాని సోఫియాకు వచ్చారు. సుదీర్ఘ చర్చల తర్వాత నాలుగు అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. పెట్టుబడులు, పర్యాటక రంగం, పౌర అణు విధానం, సోఫియా వర్శిటీలో హిందీ విభాగం ఏర్పాటుపై ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఒప్పందం ఖరారైంది. భారత్‌లో ఐటి రక్షణ రంగాలు అభివృద్ధిలో పరుగులుపెడుతున్నాయని, పెట్టుబడులు పెట్టాలని రాష్టప్రతి కోరారు. రక్షణ రంగంలో మధ్య, చిన్న తరహా ఆయుధాల ఉత్పత్తిలో బల్గేరియా అగ్రస్థానంలో ఉంది. చిన్న తరహా ఆయుధాల సరఫరాలో బల్గేరియా ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. ఇరుదేశాల అధినేతల మధ్య చర్చలు సఫలమయ్యాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ స్థిరపడిన భారతీయులను ఉద్దేశించి రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ, భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఇక్కడ 250 మంది భారతీయుల కుటుంబాలు ఉన్నాయి. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా మరో 400 మంది ఉద్యోగులు ఐటి రంగం అభివృద్ధిలో పనిచేస్తున్నారు.

చిత్రం..బల్గేరియా రాజధాని సోఫియా చేరుకున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం చెబుతున్న
ఆ దేశాధ్యక్షుడు రుమెన్ రాదెవ్