అంతర్జాతీయం

గురు కక్ష్యలోకి ‘జునో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోస్టన్, జూలై 5: రోదసి ప్రయోగాల పరంపరలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన జునో రోదసి నౌక భూమి నుంచి అయిదు సంవత్సరాల పాటు ప్రయాణించి విజయవంతంగా గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. గ్రహాలకు రాజుగా, సౌరమండలంలో అత్యంత కీలకమైన గురుగ్రహ కక్ష్యలోకి భూమి నుంచి ఒక రోదసి నౌక ప్రవేశించగలగటం అంతరిక్ష పరిశోధనల్లో అతి పెద్ద ముందడుగుగా శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలోనే జునో గురుకక్ష్యలోకి ప్రవేశించిందన్న వార్త రావటం అమెరికన్లలో ఉత్సాహాన్ని నింపింది. 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చుతో రూపొందించిన జునో ను 2011 ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కనవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించారు. సరిగా అయిదు సంవత్సరాల తరువాత మంగళవారం ఉదయం 8:48 గంటలకు జునో ప్రధాన ఇంజన్ మండటం ప్రారంభించిందని, సెకనుకు 542 మీటర్ల వేగంతో గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించిదని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. ఇంజన్ మండటం పూర్తయిన వెంటనే జునో సూర్య కిరణాలను స్వీకరించటం ప్రారంభించిందాన్నారు. 18,698 విడివిడి సోలార్ సెల్స్ జునోకు విద్యుత్ ఇంధనాన్ని అందిస్తున్నాయని వారు వివరించారు. గురుగ్రహంపైనున్న దళసరి అయస్కాంత పొర సామర్థ్యం గురించి జునో అధ్యయనం చేస్తుందని శాస్తవ్రేత్తలు వివరించారు. దీంతో పాటుగా గురు గ్రహంపై ఉన్న నీటి శాతం, అమ్మోనియా, వాతావరణం వంటి అంశాలపై అధ్యయనం చేసి భూమికి సంకేతాలను పంపిస్తుందని వారు తెలిపారు.

చిత్రం.. జునో రోదసి నౌక గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న శాస్తజ్ఞ్రులుజునో రోదసి నౌక గురుగ్రహ కక్ష్యలోకి ప్రవేశించడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న శాస్తజ్ఞ్రులు