అంతర్జాతీయం

పడవ బోల్తాపడి 27మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మబండకా, సెప్టెంబర్ 19: ఉత్తర డెమొక్రటిక్ రిపబ్లిక్ కాంగోలోని కాంగో నది ఉపనది మొంగల నదిలో ఒక పడవ బోల్తాపడి కనీసం 27 మంది నీట మునిగి చనిపోయారని స్థానిక అధికారి ఒకరు బుధవారం తెలిపారు. పడవలోని మిగతా వారు కూడా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ‘క్రితం రోజు రాత్రి మొంగల నదిలో నాటు పడవ బోల్తాపడిన సంఘటనలో 27 మంది మృతదేహాలను బయటకు తీయడం జరిగింది’ అని ప్రొవిన్షియల్ గవర్నర్ అల్ఫా బెలో-నగ్వాటా బుధవారం ఒక వార్తాసంస్థకు చెప్పారు. నదిలో ఇంకా మృతదేహాలు ఉన్నాయని, వాటిని బయటకు తీసుకు రావడానికి సహాయ సిబ్బంది కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.