అంతర్జాతీయం

పాక్‌ది వృథాప్రయాసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 24:ఎవరి మద్దతు లేకుండా కాశ్మీర్ అంశాన్ని ఐరాస సదస్సులో ఎన్నిసార్లు ప్రస్తావించినా ప్రయోజనం ఉండదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. తాజాగా జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని పాక్ యోచిస్తున్న దృష్ట్యా భారత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐరాస వంటి బహుముఖ సంస్థలో పాకిస్తాన్ సాగించే ఏకపాత్ర నాటకానికి ఎలాంటి ప్రాధాన్యతా ఉండదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అన్నది అంతర్జాతీయ వేదికని, దీనిపై అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలనే ప్రస్తావించాల్సి ఉంటుందని హితవు పలికారు. అయితే ప్రతి దేశం సార్వభౌమత్వ దేశమే కాబట్టి దాని ప్రయత్నాలను అది చేసుకునే అవకాశం ఉంటుందని అక్బరుద్దీన్ అన్నారు. గతం కంటే భిన్నంగా మరింత తీవ్రస్థాయిలోనే కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ఐరాస సమావేశాల్లో ప్రస్తావించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘అన్ని దేశాల మద్దతు, సహకారం ఉంటేనే ఏ సమస్యపైనైనా అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది’అని జవాబిచ్చారు.

చిత్రం.. సయ్యద్ అక్బరుద్దీన్