అంతర్జాతీయం

ముషారఫ్ ఇప్పట్లో పాక్‌కు రాలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 1: నిర్ధారణ కాని కొత్తవ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్( 75) రోజురోజుకు క్షీణించిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొంటున్న రాజద్రోహం కేసుకు సంబంధించిన విచారణకు రాలేరని ఆయన పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఒకరు తెలిపారు. 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ రాజ్యాంగాన్ని రద్దు చేశారన్న అభియోగంపై తీవ్ర రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్నారు. ముషారఫ్ తన వ్యాధి చికిత్స నిమిత్తం ప్రతి మూడు నెలలకొకసారి లండన్ వెళ్తున్నారని ఆయన పార్టీ ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అంజాద్ తెలిపినట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. అంతేకాకుండా ముషారఫ్ వెన్నుపూస విరిగిందని, దానికి అమెరికాలో చికిత్స పొందారని తెలిపారు. ఇప్పుడు ఆయన తెలియని మరో కొత్తవ్యాధితో బాధపడుతున్నారని, దానికి చికిత్స నిమిత్తం ప్రతి మూడు నెలలకొకసారి లండన్ వెళ్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కేసుల విచారణకు ఆయన హాజరయ్యే పరిస్థితి లేదని అంజాద్ పార్టీ నేతలతో సమావేశం అనంతరం ఆదివారం పేర్కొన్నట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. ఆయనకు వచ్చిన వ్యాధి గురించి తాము వెల్లడించలేమని, అయితే తాము కోర్టుకు హాజరైనప్పుడు ఆ వ్యాధికి సంబంధించిన పత్రాలను పాకిస్తాన్ చీఫ్ జస్టిస్‌కు సమర్పిస్తామని ఆయన చెప్పారు. తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ పరిస్థితుల్లో పాక్‌కు తీసుకువచ్చి ఆయన ప్రాణానికి హాని చేయలేమన్నారు. ముషారఫ్ పాకిస్తాన్ వస్తారని, కాని ఆయనను స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని, అలాగే చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని, ఇలా చేస్తేనే ఆయన పాక్‌కు వస్తారని ఆయన స్పష్టం చేశారు. జూలై 25న జరిగే సాధారణ ఎన్నికలకు ముందే ఆయనను ఇక్కడికి రప్పించడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. న్యాయపరమైన సూచనలు తీసుకున్న తర్వాత ఎప్పుడు, ఎలా పాకిస్తాన్ రావాలన్నది ముషారఫ్ నిర్ణయిస్తారని అన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను పరారీలో ఉన్న నిందితుడిగా కోర్టు ఇప్పటికే ప్రకటించింది. అయితే కేసు విచారణకు ఆయన హాజరైతే ఉన్నతస్థాయి రక్షణ కల్పిస్తామని పాకిస్తాన్ సుప్రీం కోర్టు గత నెలలో హామీ ఇచ్చింది.