అంతర్జాతీయం

ప్రగతిశీల లక్ష్యాలతో భారత్ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్‌నేషన్స్, అక్టోబర్ 1: భారతదేశం అనుసరిస్తున్న ‘క్లీన్ ఇండియా’, ‘ఆడబిడ్డలకు చదివించు..రక్షించు’ నినాదాలు, పథకాలు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాయని, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఏ దేశానికైనా వీటి ఆవశ్యకత ఉందని యునైటెట్ నేషన్స్ సెక్రటరీ జనరల్ అంటానియో గూటర్రెస్ పేర్కొన్నారు. భాతర దేశంలో గట్టర్ మూడు రోజుల పర్యటనను సోమవారం నుంచి ప్రారంభించిన గట్టర్ ఈమెయిల్ ద్వారా పీటీఐ ప్రతినిధికి ఇంటర్య్వూ ఇచ్చారు. అసమానతలు తొలగడానికి, సాంఘిక సంక్షేమానికి ఎన్నో సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని, ఈ దిశలో సుదీర్ఘమైన విధానాలను, నాయకత్వాన్ని ఈ దేశం కలిగివుందని అన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) ప్రపంచం మొత్తానికీ ఉమ్మడి లక్ష్యమని, ఈ దిశలోనే యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) ద్వారా పేదరిక నిర్మూలన, భూమిని రక్షించుకోవడం, ఆరోగ్య, విద్యాభివృద్ధి ద్వారా ప్రజలు ప్రశాంతమైన, ఐశ్వర్యప్రదమైన జీవనం గడిపేలా చేయాలన్న లక్ష్యాన్ని 2030 వరకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పారిశుధ్ధ్య పరిరక్షణ, మహిళలకు ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచడం, నాణ్యతతో కూడిన విద్యాబోధన, అసమానతలను తగ్గించడం వంటివి ఉన్నాయన్నారు. భారత దేశంలో ఈ దిశగా చేపట్టిన అనేక కార్యక్రమాలు ఎంతో ప్రభావవంతమైన ఫలితాలను ఇచ్చాయన్నారు. కేవలం రెండున్నరేళ్లలో స్వచ్‌భారత్ (క్లీన్ ఇండియా) కార్యక్రమం ద్వారా జరిగిన ప్రగతి తననెంతగానో ఆకట్టుకుందని గట్టర్ అన్నారు. ఈ కాలంలో 39 మిలియన్ల గృహ అనుబంధ మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా చేయాలన్న లక్ష్యం కూడా అభినందనీయమన్నారు. అలాగే నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన భేటీ బచావ్, భేటీ పడావ్ కార్యక్రమాలు కూడా దేశంలో మధ్యలోనే బడిమానేసే ఆడపిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించిందని, తద్వారా విద్యలో లింగ వివక్షకూడా తగ్గిందని గట్టర్ చెప్పారు. అలాగే ప్రభుత్వ పథకాలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఆహార సరఫరా, రేషన్ కార్డుల కేటాయింపు వంటివి మరింత సులభతరం అయ్యాయన్నారు.