అంతర్జాతీయం

కున్హీ అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 4: దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయుడికి బంపర్ లాటరీ తగిలింది. ఎకాఎకిన రూ.14 కోట్ల లాటరీలో వరించింది. ఈ సొమ్మును తన స్నేహితుడి మూత్రపిండాల మార్పిడి శస్తచ్రికిత్సకు ఉపయోగిస్తానని లాటరీ విజేత మహ్మద్ కున్హీ మయ్యాల చెప్పారు. కేరళకు చెందిన 42 ఏళ్ల కున్హీ గార్మెంట్ పరిశ్రమలో 15 ఏళ్లుగా సేల్స్ మ్యాన్‌గా పనిచేస్తున్నారు. మొదట ఈ లాటరీ తగిలినట్లు లాటరీ సంస్థ ఫోన్ చేసి చెప్పినట్లు కున్హీ చెప్పారు. కాని తాను నమ్మలేదన్నారు. ఈ వివరాలను ఖలేజా టైమ్స్ అనే పత్రిక ప్రకటించింది. ఈ కాల్ నకిలీదని భావించానని కున్హీ చెప్పారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌ను చెక్ చేశానని, అప్పుడు తనకు లాటరీ నిజంగానే తగిలినట్లు తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. తనకు లభించిన లాటరీ సొమ్ములో ఏడు మిలియన్ల రూపాయలను మూత్ర పిండాల మార్పిడి ఆపరేషన్‌కు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. తనతో పాటు అబూదాబీలో తన స్నేహితుడు పనిచేస్తూ మూత్రపిండాల రోగాలతో బాధపడుతున్నాడన్నారు. రెండు కిడ్నీలు పాడైపోయాయన్నారు. తాను మిగిలిన సొమ్ముతో సొంత వ్యాపారం చేస్తానన్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఆయన చెప్పాడు. తనకు తగిలిన లాటరీ సొమ్ములో కొంత భాగాన్ని కేరళ వరదబాధితులకు వితరణగా ఇవ్వనున్నట్లు చెప్పారు. కేరళకు చెందిన తాజో మ్యాథ్యూకు కూడా ఇటీవల 1.9 మిలయన్ డాలర్ల లాటరీ తగిలింది. గతంలో మనదేశానికి చెందిన ఒక డ్రైవర్‌కు లాటరీ తగిలింది. ఈ ఏడాది జనవరిలో కేరళకు చెందిన మరో వ్యక్తికి 12 మిలియన్ల దీనారాల లాటరీ లభించింది.