అంతర్జాతీయం

ఔను..నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 15: వాతావరణ మార్పుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలిక్కరుచుకున్నారు. మొదట ఈ మార్పులు అభూత కల్పన అని పేర్కొన్న ఆయన ప్యారిస్ పర్యావరణ ఒప్పందంపైనా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ పర్యావరణ మార్పులు వాస్తవమేనని, ఇవి కల్పన కాదంటూ వాస్తవ పరిస్థితుల్ని అంగీకరించారు. వాతావరణ మార్పులకు కారణమవుతున్న ప్రమాదకర కాలుష్య ఉద్గారాల విషయంలో అమెరికాపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ మార్పులను నిరోధించే చర్యలకు సంబంధించి అమెరికా తగిన విధంగానే స్పందిస్తుందని పేర్కొన్న ట్రంప్ పర్యావరణ శాస్తవ్రేత్తలు భారీ రాజకీయ అజెండాతోనే పనిచేస్తున్నారని కూడా చిందులు వేశారు. వాతావరణ మార్పులు కల్పనేనని ఇప్పటికీ భావిస్తున్నారా అంటూ సిబిఎస్ 60 న్యూస్ చానల్ అడిగిన ప్రశ్నకు ‘నేను అలా భావించడం లేదు. అయితే ఇది మానవ కారణంగా సంభవించిదా కాదా అన్న విషయంలో నేను స్పష్టంగా ఏమీ చెప్పలేను’అని జవాబిచ్చారు. అయితే ఈ మార్పుల నిరోధనకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఇవ్వడానికి, అలాగే లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను’అని స్పష్టం చేశారు. గతంలో పారిస్ ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్ దీని వల్ల చైనా, భారత్ వంటి దేశాలకు ప్రయోజనం కలుగుతోందని, అమెరికా నష్టపోతోందని వాదించిన విషయం తెలిసిందే.