అంతర్జాతీయం

సిరిసేనకు సుప్రీం చిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 12: శ్రీలంక అధ్యక్షుడు మణిపాల సిరిసేనకు ప్రధాన రాజకీయ పార్టీలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 20నెలల గడువుకు ముందే పార్లమెంట్‌ను రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. ప్రధాన మంత్రి పదవి నుంచి విక్రమసింఘేను తప్పించి మాజీ అధ్యక్షుడు రాజపక్సకు పట్టం కట్టిన సిరిసేన ఆయనకు మెజార్టీ నిరూపించుకునే అవకాశం లేకపోవడంతో ఏకంగా పార్లమెంట్‌ను రద్దు చేసి జనవరి 5న మధ్యంతర ఎన్నికలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మండిపడుతున్న రాజకీయ పార్టీలు సిరిసేన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో లంక రాజకీయ సంక్షోభం మరో మలుపుతిరిగింది. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ దేశాధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మొత్తం 20 రాజకీయ గ్రూపులు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. పిటిషనర్లలో ఎన్నికల కమిషన్ సభ్యుడు రత్నజీవన్ హూలే కూడా ఉండటం గమనార్హం. పార్లమెంట్ రద్దును గట్టిగా సమర్థించుకుంటున్న సిరిసేన దేశంలో అల్లర్లు జరుగకుండా నిరోధించేందుకే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈ నెల 14న పార్లమెంట్‌లో జరుపతలపెట్టిన బలపరీక్షలో ఘర్షణలు జరిగేందుకు ఆస్కారం ఉందని తనకు సమాచారం అందిందని దేశాన్నుద్దేశించి చేసిన ప్రసంగంలో సిరిసేన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌ను రద్దు చేయడమే సరైన, సముచితమై నిర్ణయంగా కనిపించిందని, దేశ వ్యాప్తంగా అల్లర్లకు ఆస్కారం లేకుండా చేయడమే దాని ఉద్దేశమని సిరిసేన తెలిపారు.